ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 2019లో తాను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో హూస్టల్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ సభపై మాట్లాడారు. కమిడియన్స్ ఆండ్రూ షుల్ట్జ్, ఆకాష్ సింగ్‌తో కలిసి ‘‘ఫ్లాగ్రాంట్’’ పోడ్‌కాస్టులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ భేటీలో పీఎం మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ బయటకు శాంతంగా, తండ్రిలా కనిపిస్తారు కానీ, ఆయన కఠినంగా ఉండే మంచి వ్యక్తి అని అభివర్ణించారు
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు తెహ్రీక్ ఇ తాలిబాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులతో సతమతం అవుతోంది. ఈ రెండు గ్రూపులు ఒకరు ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో విరుచుకుపుడుతున్నాయి. ముఖ్యంగా బీఏల్ఏ మిలిటెంట్లు పాకిస్తాన్ సైన్యం
Shocking: పాకిస్తాన్లో దారుణం జరిగింది. తాను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లికి అడ్డు చెబుతున్నారని ఓ యువతి ఏకంగా మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. ఈ ఘటన సింధ్ ప్రావిన్సులోని ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న చోటు చేసుకుంది. తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ప్రియుడితో కలిసి యువతి కుట్ర పన్నింది.
ఇండియా ఉమెన్స్ టీమ్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే పాకిస్థాన్‌పై విజయం సాధించినా.. టీమిండియాకు సెమీస్ మార్గం అంత సులువు కాదు. టీమిండియా తదుపరి రెండు మ్యాచ్‌లు ఆసియా ఛాంపియన్ శ్రీలంక, డిఫెండింగ్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరగనున్నాయి. సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ముఖ్యం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ టోర్నీకి భారత్‌తో పాటు అన్ని జట్లూ పాకిస్థాన్‌కు వస్తాయనడంలో సందేహం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నక్వీ అన్నారు. రాజకీయ సమస్యల కారణంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదని చెప్పారు. ఈ రెండు జట్లు బహుళ-దేశాల టోర్నమెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఛాంపియన్స్…
Family Murder: ఒక అమ్మాయి తన ప్రేమ కోసం తన కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసింది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో తన కుటుంబానికి చెందిన 13 మందిని చంపిన బాలికను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఇష్టానుసారం పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా లేకపోవడంతో అమ్మాయి ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ మరణాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి…
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ కొట్టింది. పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 106 పరుగుల లక్ష్యాన్ని 5 బంతులు ఉండగానే చేధించింది. భారత్ బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉండి జట్టును విజయం వైపు తీసుకెళ్లింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.