భారత్- పాకిస్థాన్ పేర్లు వచ్చినప్పుడల్లా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. చాలా విషయాల్లో పాకిస్థాన్ కంటే భారత్ చాలా ముందుంది అనడంలో సందేహం లేదు. కొన్ని విషయాల్లో మాత్రం పాకిస్థాన్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. అదేంటో అని సందేహిస్తున్నారు. ఏం లేదండి.. పాకిస్థాన్ దేశం మధుమేహ వ్యాధిగ్రస్తుల జాబితాలో మనకంటే చాలా అడుగులు ముందుంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశంలో మాత్రం పొరుగు దేశాల కంటే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ 27వ స్థానం, శ్రీలంక 48, చైనా 57 స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదికలో 20 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను చేర్చారు. టైప్-1, టైప్-2 మధుమేహం రేటును నివేదికలో పేర్కొన్నారు.
భారతదేశం సంఖ్య ఎంత?
ఈ జాబితాలో భారత్ అమెరికా, సౌదీ అరేబియా కంటే మెరుగ్గా ఉంది. ఈ జాబితాలో భారత్ ర్యాంక్ 64వ స్థానం. తాజా జాబితా ప్రకారం.. పాకిస్థాన్‌లో మధుమేహం రేటు 30.8 శాతం. ఈ రేటుతో పాకిస్థాన్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌లో మధుమేహం రేటు 14.2%, అమెరికాలో ఇది 10.7%గా నమోదైంది. చైనాలో ఈ రేటు 10.6% కాగా.. ఈ జాబితాలో భారత్ 9.6 శాతంతో 64వ స్థానంలో ఉంది.
ఏ దేశం ఉత్తమమైనది?
ఈ జాబితాలో నైజీరియా చాలా మెరుగ్గా ఉంది. నైజీరియాలో మధుమేహం రేటు 3.6%. అంటే ఈ దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా తక్కువ. దీని తర్వాత కెన్యా (4%), ఇథియోపియా (5%) ఉన్నాయి. ఈ జాబితాలో రష్యా 153వ స్థానంలో ఉంది. రష్యాలో మధుమేహం రేటు 5.6%గా నమోదైంది.