Pakistan: పాకిస్తాన్ సైన్యంపై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.
Violence against Hindus: 2024లో బంగ్లాదేశ్‌లో హిందువులపై 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయలో పాకిస్తాన్లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌కి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ పాలన పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నాయకుడు మహ్మద్ యూనస్ గురువారం మాట్లాడుతూ.. తానున పాకిస్తాన్‌తో సంబంధాల బలోపేతానికి అంగీకరించానని చెప్పారు. ఈ పరిణామం భారత్‌కి ఇబ్బందికలిగించేలా మారింది.
US- Pakistan: దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిస్సైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ పేర్కొన్నారు.
Betting App: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న బెట్టింగ్ యాప్ రాకెట్లో పాకిస్తాన్ కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాక్ జాతీయుడికి చెందిన వ్యక్తిదే ఈ బెట్టింగ్ యాప్ అనేది విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మ్యాజిక్‌విన్ బెట్టింగ్ యాప్‌లో పాకిస్తానీ కోణాన్ని ఈడీ కనిపెట్టడం ఇదే తొలిసారి.
లోక్‌సభలో మాట్లాడిని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ బంగ్లాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటిని నివారించడానికి ఆ దేశ తాత్కాలిక సర్కార్ మైనారిటీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే కోచింగ్ బాధ్యతల నుంచి గ్యారీ కిరిస్టెన్ వైదొలగా.. తాజాగా జాసన్ గిలెస్పీ గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గిలెస్పీ పదవీకాలం 2026 వరకు ఉన్నా.. ముందే వైదొలగడం గమనార్హం. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును కెప్టెన్, కోచ్‌ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. పీసీబీలో సరైన వారు లేకపోవడంతో కెప్టెన్, కోచ్‌లు తరచుగా మారుతున్నారు. Also…
2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధతకు తెర పడినట్లు తెలుస్తోంది. ట్రోఫీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌లో నిర్వహించనుంది. అంతేకాదు 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్‌లో పాకిస్తాన్ పర్యటించకుండా.. హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2025 ఫిబ్రవరి, మార్చిలో…
ఇవాళ (డిసెంబర్ 5కి) జరిగిన సమావేశం మరోసారి వాయిదా పడింది. అయితే, మరోసారి ఐసీసీ సమావేశాన్ని రెండు రోజులకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. పాకిస్థాన్ ఆతిథ్యంలోనే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సింది. కానీ, పాక్‌కు వెళ్లి ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలతో అక్కడికి టీమిండియాను పంపించమని తేల్చి చెప్పింది.