Pakistan: ‘‘అజ్ఞాత వ్యక్తుల’’ చేతిలో హఫీస్ సయీద్ సన్నిహితుడి హతం.. భారత వ్యతిరేకులే టార్గెట్..
- పాకిస్తాన్‌లో మరో ఉగ్రవాది ఖతం..
- గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మృతి..
- లష్కరే తోయిబా, హఫీస్ సయీద్‌కి కావాల్సిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. నిజానికి టెర్రరిస్టుల్ని చూస్తే ప్రజలు భయపడాలి కానీ, పాకిస్తాన్‌లో మాత్రం బయటకు వెళ్లాలంటే ఉగ్రవాదులు భయపడి చస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్చి చంపుతారో తెలియడం లేదు. గత కొన్నేళ్లుగా ఒకే విధంగా ఉగ్రవాదుల్ని అజ్ఞాత వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు.
Read Also: Mallidi Krishna: డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ తమ్ముడు
Also Read
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
తాజాగా రంజాన్ రోజునే లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రసంస్థకు ఫైనాన్షియర్‌గా, 26/11 ఉగ్రవాదుల సూత్రధారి హఫీస్ సయీద్ సన్నిహితుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతుడిని అబ్దుల్ రెహమాన్‌గా గుర్తించారు. పాక్ వాణిజ్య నగరం కరాచీలో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, బైక్‌పైన వచ్చిన వ్యక్తులు దుకాణంలో నిలబడి ఉన్న రెహమాన్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
రెహ్మాన్ లష్కరే తోయిబాకు ఆర్థిక సాయం అందిస్తున్న అగ్రశ్రేణి ఫైనాన్షియర్లలో ఒకరు. పాకిస్తాన్, భారత్ వ్యాప్తంగా వివిధ దాడులకు లష్కరే తోయిబా కారణం. రెహమాన్ కరాచీలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఈ ఉగ్రసంస్థకు నిధులు సేకరించే పని చేస్తున్నాడు. ఇటీవల లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్, ఆ తర్వాత కొన్ని రోజులకే మరో ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. అబూ ఖతర్ 2017 రియాసి బాంబు పేలుడు, 2023 జమ్మూ కాశ్మీర్ యాత్రికులు బస్సుపై దాడి చేసిన ఘటనలో కీలక సూత్రధారి.
🚨Eid ki Eidi for Hafiz Saeed
Financier of Lashkar-e-Taiba, Qadri Abdu Rehman , who also is a relative of India’s Most Wanted Hafiz Saeed has been Shot dead by Unknown Gunmen in Karachi.#EidMubarak pic.twitter.com/stOuSqjoh3
— Amitabh Chaudhary (@MithilaWaala) March 31, 2025
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్‌ప్లే, 108MP కెమెరా
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!