భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్-చైనా కుట్రలు ఉన్నతంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్విదేది కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలను అంగీకరించాలన్నారు.
Pakistan: పాకిస్తాన్ మతం ఆధారంగా భారత్ నుంచి విడిపోయి ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. ఆ దేశంలో 96 శాతం మంది ముస్లింలే, కేవలం 1-2శాతం మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ విభజన సమయంలో 20 శాతం వరకు ఉన్న హిందువులు, అణిచివేత కారణంగా కేవలం సింగిల్ డిజిట్‌కి పరిమితమయ్యారు. హిందువులపై అఘాయిత్యాలు, కిడ్నాప్‌లు పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. బాలికలు, మహిళల్ని బలవంతంగా అపహరించి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్న ఘటనలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ బ్యూరో…
Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని అన్నా రోడ్డులో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందంటూ ఒక్కసారిగా ఐదు అంతస్తుల భవనం నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో అన్నా రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో టోర్నీలో 9వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నిరంతర వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడలేదు. టాస్ పడకముందు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ ఎడతెరిపి ఇవ్వకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలు చూస్తే, రాబోయే కొన్ని రోజుల్లో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర అసహనంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంది. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతుల్లో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్థాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఫైర్ అయ్యారు. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనమైందని మండిపడ్డారు.…