Pakistan: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది.
భారత్- పాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఈ మీటింగ్ లో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన తమ వాదనలు తెలియజేయనున్నారు.
Punjab: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు దొరికారు. ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఫోటోలను లీక్ చేయడంలో వీరి పాత్రకు సంబంధించి పంజాబ్ పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.
India Pakistan War: భారత్ ను రెచ్చగొట్టేలా రష్యాలోని పాకిస్తాన్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీద్ జమాలీ వ్యాఖ్యలు చేశాడు. పాక్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇస్లామాబాద్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందని అన్నారు.
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఒక విఫల దేశం’’ అని అభివర్ణించారు. అది ఎప్పుడూ భారత్‌ని శాంతియుతంగా జీవించనివ్వదు అని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. పాక్ ప్రభుత్వం, ఆర్మీని టార్గెట్ చేస్తూ బీఎల్ఏ యోధులు విరుచుకుపడుతున్నారు.
Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని చెల్లించబోతోంది.
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌కి భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌ని ఎలా దెబ్బతీస్తే ఆ దేశం పతనమవుతుందో అలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే, పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, సినీయాక్టర్ల ఇన్‌స్టా అకౌంట్లు, యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. పాక్ మీడియా, వెబ్సైట్లను నిషేధించింది. ఇదే కాకుండా, పాక్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని నిషేధించింది
India Pakistan: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే, పాకిస్తాన్ నాయకులు మాత్రం రోజుకో ప్రకటన చేస్తూ, రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతను పెంచుతున్నారు. తాజాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ..