Balochistan: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్వెట్టాను స్వాధీనం చేసున్న బలూచిస్థాన్.. పాక్ ఆర్మీ పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలూకిస్థాన్ నుంచి ఓ వార్త వెలువడుతోంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
READ MORE: India-Pakistan War: పాకిస్థాన్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు.. షరీఫ్‌ను తరలించిన పాక్ సైన్యం..
Also Read
తాజాగా భారత్‌లోని పలు నగరాలపై పాకిస్థాన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడులను భారత్ తిప్పికొట్టింది. ఇటు భారత్‌తో పాక్ సైనికులు తలపడుతున్న నేపథ్యంలో బలూచిస్థాన్‌లోని క్వెట్టాలో బలూచ్ యోధులు రంగంలో దిగారు. క్వెట్టాలోని పాకిస్థాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్థాన్ యోధులు దాడి చేశారు. తాజా నివేదికల ప్రకారం.. బలూచి తిరుగుబాటుదారులు క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, పాకిస్థాన్ సైన్యాన్ని అక్కడ నుంచి తరిమేశారని తెలుస్తోంది.
READ MORE: India-Pakistan War: యుద్ధ బరిలోకి INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం?
క్వెట్టా నగరం జంగ్లే బాగ్‌లోని కాంబ్రానీ రోడ్డు వద్ద ఉన్న పాకిస్థాన్ దళాల కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌ను బలూచి యోధులు లక్ష్యంగా చేసుకున్నారు. సమీపంలోని ఆరు ప్రాంతాల్లో… ఒకేసారి పేలుళ్లు జరిపింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ. జమరాన్ కట్గాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ ఆక్రమణ దళాల చెక్‌పాయింట్‌పై బీఎల్‌ఏ యోధులు ఆటోమేటిక్ ఆయుధాలతో దాడి చేశారు. లాంచర్‌ను ఉపయోగించి బహుళ గ్రెనేడ్‌లను కూడా ప్రయోగించారు. వారి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించారు. పాక్‌లోని చమురు క్షేత్రాలపై బలూచీల దాడులు చేసింది. దీంతో చాలా మంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్ సైన్యం క్వెట్టా నుంచి పారిపోయింది. కాగా..పాక్‌పై భారత్ దాడులను బలూచీ రేడియో హైలెట్ చేస్తోంది. భారత్‌కు మద్దతు ఇస్తోంది.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!