Student Marries Teacher: ప్రేమ గుడ్డిదంటే ఒప్పుకోని కొందరు ఈ జంటను చూస్తే నిజమే అని ఒప్పుకోక తప్పదు. వయో వ్యత్యాసాన్ని కూడా పట్టించుకోకుండో ఆ జంట ప్రేమించుకుంది. పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఆ జంట. ఆ జంట వయస్సెంతో తెలుసా..? ఆయనకు 52 ఏళ్లు కాగా.. ఆమెకు 20 ఏళ్లు మాత్రమే. తండ్రి వయసున్న వ్యక్తి యువతి వివాహం చేసుకుంది. ఊహించుకునేందుకు కొంచెం కష్టంగా ఉన్న నమ్మక తప్పదు. ఈ వింత పెళ్లి పాకిస్థాన్‌లో జరిగింది.
పాకిస్థాన్‌లో 20 ఏళ్ల వయసు గల ఓ యువతి 52 ఏళ్ల టీచర్‌ను పెళ్లి చేసుకుంది. ఆయన ఆ యువతి కంటే దాదాపు 32 ఏళ్ల పెద్దవాడు. అంత వయసు తేడా ఉన్నా ప్రేమించి వివాహం చేసుకుంది. ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యి ప్రేమలో పడినట్లు ఆ యువతి వెల్లడించింది. వీళ్లిద్దరూ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. జోయా నూర్ అనే యువతి డిగ్రీ చదువుతుండగా… ఈ క్రమంలో తన టీచర్ సాజిద్ అలీతో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని టీచర్‌కు తెలియజేయగా సున్నితంగా తిరస్కరించాడు. వయస్సు తేడా ఉండడంతో తిరస్కరించినట్లు ఆ వీడియో తెలిపాడు. తర్వాత ఆమె పోరాటం చేసి ప్రేమికుడి ప్రేమను దక్కించుకుంది.
Peddireddy Ramachandra Reddy: విద్యుత్ తీగల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
యువతి ప్రేమకు ఉప్పొంగిపోయిన ఆయన ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒకే చెప్పాడు కానీ ఒక వారం సమయం కావాలని కోరాడు. ఎట్టకేలకు యువతితో వివాహానికి ఓకే చెప్పాడు. ఈ విషయాన్ని జోయా ఇంట్లో చెప్పగా వద్దని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తల్లిదండ్రులను కాదని జోయా సాజిద్‌ను వివాహం చేసుకుంది. ఆమె చేసే టీకి తాను అభిమానినని సాజిద్ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రేమికుల లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.