Pakistan as the “epicentre” of terrorism says jai shankar: ప్రపంచం ముందు భారతదేశాన్ని దోషిగా నిలబెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే భారత విదేశాంగ శాక మంత్రి ఎస్ జైశంకర్ మాత్రం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాలకు హాజరైన జైశంకర్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ ఉగ్రవాదాన్ని భారత్ కన్నా మెరుగ్గా ఏ దేశం వాడుకోలేదు’’అంటూ పచ్చి ప్రేలాపనలు చేసింది హీనా రబ్బానీ.
Read Also: Avatar 2 Public Talk Live: అవతార్ 2 సినిమా రిలీజ్… పబ్లిక్ టాక్
ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. జైశంకర్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ప్రపంచం ఏం పిచ్చిది కాదు.. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ ఘాటుగా బదులిచ్చారు. గతంలో హిల్లరీ క్లింటన్ గతంలో పాకిస్తాన్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ‘‘ మన పెరట్లో పాములు పెంచి పక్కవారిని కాటేయాలంటే ఎలా..? అవి మనల్ని కూడా కాటేస్తాయి’’ అని పాకిస్తాన్ కు హితవు పలికారు. కానీ పాకిస్తాన్ కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదని ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టు న్యూఢిల్లీ, కాబుల్, పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదాన్ని దక్షిణాసియా ఇంకెంత కాలం చూడబోతోందని ప్రశ్నించిన క్రమంలో జైశంకర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ విషయాన్ని మీరు వేరే మంత్రిని అడుగుతున్నారు.. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మీరు పాకిస్తాన్ మంత్రులను అడగాలంటూ మాస్ రిఫ్లై ఇచ్చారు. ఇటీవల లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీస్ సయీద్ ఇంటి ముందు గతేడాది బాంబు పేలుడు జరిగింది. అయితే దీనిపై భారత్ ను నిందిస్తూ పాకిస్తాన్ ఇటీవల ఓ ప్రకటన జారీ చేసింది. దీనిపై హీనా రబ్బాని ఖర్ భారత్ పై ఉగ్రవాద వ్యాఖ్యలు చేశారు.