Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచీలతో ఆకట్టుకున్న ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకుని తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. హరారే వేదికగా అతని దూకుడు బ్యాటింగ్ అభిమానులను మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లను కూడా ఆకట్టుకుంది. వైభవ్ ప్రదర్శనపై స్పందించిన భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ అతడిని వన్డే జట్టులో కూడా అవకాశం ఇవ్వాలని సూచించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రదర్శన చేయడం విశేషమని ఆయన ప్రశంసించారు.
అయితే వైభవ్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయం ఏమిటంటే, అతని తదుపరి అంతర్జాతీయ మ్యాచ్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. భారత జట్టు తదుపరి శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుండగా, వైభవ్ ప్రస్తుతం టెస్ట్ జట్టులో భాగంగా లేడు. దీంతో ఆ సిరీస్‌లో అతను కనిపించడు. కానీ, ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో ఆడనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో వైభవ్ మళ్లీ బరిలోకి దిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మూడు వన్డేల తర్వాత జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతనికి స్థానం దాదాపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ 2026 అక్టోబర్ 6న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. జింబాబ్వే పర్యటనలో తన సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ మరోసారి భారత జెర్సీలో మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. వైభవ్ ఏ మ్యాచ్‌లోన తగ్గకుండా పరుగుల వరద పారించాలని.. తన బ్యాట్ నుంచి వచ్చే సొగసైన సిక్సర్లు చూడాలని.. మెరుపులాంటి.. ఫోర్లు ఆస్వాదించాని ఎదురు చూస్తున్నారు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!