T20 World Cup: టీ20 ప్రపంచకప్ 1992 వన్డే ప్రపంచకప్ జరిగినట్లే జరుగుతోంది. అప్పుడు, ఇప్పుడు మెగా టోర్నీకి వేదిక ఆస్ట్రేలియానే కావడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దయతో సెమీస్ బెర్త్ కొట్టేసిన పాకిస్థాన్ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు రెండో సెమీస్ నుంచి ఫైనల్‌కు ఎవరు వస్తారు అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రికెట్ అభిమానులు దాయాదుల పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్థాన్ కూడా ఫైనల్‌కు…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్ బెర్త్ పొందిన పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు…
T20 World Cup: సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో ఆ జట్టు బౌలర్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు జోరు పెంచలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు చేయగా,…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో దాయాదులు తలపడితే మరోసారి చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. క్రికెట్లో భారత్-పాకిస్థాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ ఇచ్చే మజానే వేరు. అందులోనూ పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిస్తే సంబరాలే సంబరాలు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మెగా టోర్నీ నాకౌట్ దశకు చేరుకోవడంతో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఇరు దేశాల…
T20 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో సెంటిమెంట్ల గోల ఎక్కువైపోయింది. ఆడింది తక్కువ ఊహాగానాలు ఎక్కువ అన్నట్లు సాగుతోంది. ఆసియాలో బలమైన జట్లు టీమిండియా, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి. అయితే టీమిండియాను 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ ఊరిస్తుండగా.. పాకిస్థాన్‌కు 1992 ప్రపంచకప్ సెంటిమెంట్ ఆశలు రేపుతోంది. కన్ను లొట్టబోయి అదృష్టం కలిసొచ్చినట్లు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్థాన్ అభిమానులు ఈ ప్రపంచకప్ మాదే అంటూ…
Sania Mirza Divorce: ప్రపంచ ప్రఖ్యాత ఉమెన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇండియాకు చెందిన మహిళ అయినా పాకిస్తాన్ కి కోడలు అయింది.
South Africa: క్రికెట్లో దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా మాత్రమే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ముందు సెమీస్ చేరుతుందని భావించిన జట్టు దక్షిణాఫ్రికా. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. బంగ్లాదేశ్‌పై భారీ విజయం, టీమిండియా అద్భుత గెలుపు చూసి దక్షిణాఫ్రికా సెమీస్‌కు వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టోర్నీ ప్రారంభం, టోర్నీ ముగింపు ఆ జట్టు దురదృష్టాన్ని మరోసారి చాటిచెప్పాయి. సూపర్-12లో దక్షిణాఫ్రికా తన…
What happened in East Pakistan is happening here now, says imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నంతో ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ పై గురువారం కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్ లో తన మద్దతుదారులతో ర్యాలీ చేస్తున్న సందర్భంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ తో పాటు పలువురు పీటీఐ…
Imran Khan: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం దాడిపై మౌనం వీడారు. దాడిలో నాలుగు బుల్లెట్లు తగిలాయని ఆయన వెల్లడించారు. జాతినుద్దేశించి చేసిన తన మొదటి ప్రసంగంలో తనపై గురువారం జరిగిన హత్యాయత్నం గురించి వివరించారు. ర్యాలీకి వెళ్లడానికి ఒకరోజు ముందు తనపై వజీరాబాద్ లేదా గుజరాత్లో హత్యకు ప్లాన్ చేస్తున్నారని తనకు తెలుసన్న ఆయన.. లాహోర్‌లోని ఆసుపత్రిలో టెలివిజన్ ప్రసంగంలో…