Army Chief General Manoj Pande: లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి చైనా బలగాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని.. వారి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చైనాను ఉద్దేశిస్తూ.. ఉత్తర సరిహద్దు వద్ద ఎల్ఏసీని మార్చేందుకు ప్రయత్నించిన అన్ని చర్యలను భారత ఆర్మీ తిప్పికొట్టిందని అన్నారు.
Read Also: KL Rahul – Athiya: కేఎల్ రాహుల్, అథియా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఈ నెల్లోనే!
పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ బాగానే ఉందని.. ఉగ్రవాద కార్యకలాపాలు, మౌళిక సదుపాలకు పాకిస్తాన్ మద్దతు ఇప్పటికీ కొసాగుతుందని.. అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ..‘‘ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) గత ఐదేళ్లులో ఉత్తర సరిహద్దు వెంబడి 2,100 కిలోమీటప్ల రోడ్డు, 7450 మీటర్ల వంతెనలను నిర్మించిదని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు వద్ద కొన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు.
తూర్పు లడఖ్ సెక్టార్ లో 500 ట్యాంకులు, 400 తుపాకులను మోహరించామని వెల్లడించారు. 55,000 సైన్య ఉండేలా మౌళిక సదుపాయలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాల్లో శాంతి నెలకొందని ఆయన అన్నారు. జనవరి 15న ప్రతీఏడాది జరుపుకునే ఆర్మీ డే ప్రత్యేకమైందని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినందుకు ఈ సారి ఆర్మీడే చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఆర్టిలరీలో త్వరలో మహిళా అధికారులను నియమించవచ్చని జనరల్ పాండే చెప్పారు, ఆ మేరకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.