Bilawal Bhutto Zardari: జమ్మూ కాశ్మీర అంశాన్ని పాకిస్తాన్ పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పాక్ ప్రతినిధులు. ముఖ్యంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ ను విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తాను కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండాగా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు.
Read Also: Ram Charan: ఇది మావా సక్సస్ అంటే… పదేళ్లలో ‘ఇండియన్ బ్రాడ్ పిట్’ అనిపించాడు
శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా భారత్ ను తమ మిత్రదేశం అని, ఆ తరువాత పొరుగు దేశం అంటూ తడబడ్డారు. కాశ్మీర్, పాలస్తీనా మధ్య సంబంధం ఉందని, రెండు కూడా ఇకే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా భారత దేశాన్ని ఉద్దేశిస్తూ.. మన పొరుగుదేశం దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతోందని, కల్లబొల్లి మాటలు చెబుతోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివాదం కాదని, ఇది అంతర్జాతీయ వివాదాస్పద ప్రాంతం కాదని వాదిస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. కాశ్మీర్, పాలస్తీనా సమస్యలను యూఎన్ పరిష్కరించలేదని ఆయన అన్నారు. భద్రతా మండలి అయిన ఇతర ఏ వేదికపై అయినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని భుట్టో కోరారు.
ఇదిలా ఉంటే ఎజెండాతో సంబంధం లేకుండా పాకిస్తాన్, భారత్ పై విమర్శలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చించాలని కోెరుతోంది. అయితే చాలా సార్లు పాకిస్తాన్ కు ధీటుగానే భారత్ బదులు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని స్పష్టం చేసింది. ముందు మీ దేశ పరిస్థితిని చూసుకోండి అని హితవు పలికింది. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత నుంచి భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.