Pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రముఖ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. తాజాగా ఆటోమోబైల్ దిగ్గజం హోండా కూడా పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పింది. బుధవారం తన ప్లాంట్ ను మూసేస్తున్నట్లు హోండా ప్రకటించింది. సప్లై చైన్ కు అంతరాయం ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణం అని…
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది.
పాకిస్థాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అస్సాంలోని నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
India at UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మానవహక్కులపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ విరుచుకుపడింది. ఇటువంటి ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Pakistan: పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ గా మారుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కో ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో మహిళా ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులు తప్పకుండా హిజాబ్ ధరించి రావాాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై అక్కడి మీడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్ లో పేర్కొంది.
Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీ హక్కులు ఎలా ఉంటోయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడి మైనారిటీలు అయిన హిందూ, సిక్కు, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుంటారు. మైనారిటీ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి మతం మార్చి పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. మైనారిటీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నా.. పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ మొసలి కన్నీరు కారుస్తుంటుంది.
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడి ప్రజలు ఏమైనా పర్వాలేదు కానీ చైనీయులకు మాత్రం ఎలాంటి హానీ కలగకూడదని భావిస్తోంది. అప్పుల్లో కూరుకుపోవడానికి ఓ రకంగా కారణం అయిన చైనాను ఇంకా పాకిస్తాన్ నమ్ముతూనే ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొంతలో కొంత చైనా, పాక్ కు మళ్లీ రుణాలు ఇస్తోంది.
పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
BJP's Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది,