S Jaishankar: భారతదేశాన్ని ఇరకాలంలో పెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా చీటికి మాటికి సరిహద్దు వివాదాలు, సీమాంతర ఉగ్రవాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాక్ లను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విభిన్న భారతదేశం అని, దేశ భద్రతకు ముప్పు వస్తే వారికి గట్టి బదులిస్తాం అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. ఉగాండా పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ భారతీయులతో ముచ్చటించారు.
Read Also: XBB.1.16: కంటి దురద, కండ్ల కలకలు ఉన్నాయా..? ఇది కరోనా కొత్తవేరియంట్ లక్షణం కావచ్చు..
భారత దేశానికి వ్యతిరేకంగా దశాబ్ధాలుగా సీమాంత ఉగ్రవాన్ని ఎగదోశారని, ఇన్నాళ్లు భారత్ వాటిని సహించిందని, కానీ ఇపై అలా ఉండబోదని, వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని , ఇది విభిన్న భారత్ అని దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అది ఎంతటి సవాళ్లనైనా ఎదురిస్తుందని, బాధ్యులకు గట్టి బుద్ధి చెబుతుందని పరోక్షంగా చైనా, పాకిస్తాన్ లను ఉద్దేశించి హెచ్చరించారు. చైనా సరిహద్దుల్లో భారత్ తమ మౌళిక సదుపాయాలను పెంచుతోందని, దేశ సైనికులు మరింత ఆయుధ సామర్థ్యంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. భారత దేశం మారిందని, ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకుంటుందని, బయటి శక్తుల ఒత్తిడి లేదని అన్నారు. మనం ఎక్కడ నుంచి ముడి చమురు కొనాలి, ఎక్కడి నుంచి కొనవద్దనే విషయాలపై బయటిదేశాల ప్రమేయం ఉండనది జైశంకర్ వ్యాఖ్యానించారు.