PAK VS NZ: రికార్డు సృష్టించిన బాబర్ ఆజమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ టీ20ల్లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లాహోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన కెప్టెన్ గా ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ ( 42), అఫ్ఘానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ స్టానిక్ జాయ్ ( 42) సరసన నిలిచాడు. ఈ క్రమంలో రెండో టీ20ల్లో అతను టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును ( 41) అధిగమించాడు. తన కెరీర్ లో మొత్తంగా 101 టీ20లు ఆడిన బాబర్ కెప్టెన్ గా 68 మ్యాచ్ ల్లో 42 విజయాలు సాధించాడు.
Also Read : SSMB 28: ఓ త్రివిక్రమ్ మా అన్ననే వెయిట్ చేయిస్తావా?
Also Read
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
ఇదే మ్యాచ్ లో బాబర్ ఈ రికార్డ్ తో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో సెంచరీ చేసిన బాబర్ ( 58 బంతుల్లో 101: 11 ఫోర్లు, 3 సిక్సర్లు ) కెప్టెన్ గా మూడు సెంచరీలు సాధించి.. టీ20ల్లో అత్యధిక సార్లు ఈ మార్కును అందుకున్న కెప్టెన్ గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( 2), స్విట్జర్లాండ్ సారథి ఫహీమ్ నజీర్( 2) ఉన్నారు.
Also Read : Warangal Crime: తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్న.. తప్పించుకోవడంతో మరో ప్లాన్!
ఇక ఇదే మ్యాచ్ లో పాక్ ఓపెనింగ్ జోడి బాబర్-మహ్మద్ రిజ్వాన్ భాగస్వామ్యంతో ఓ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్ లో తొలి వికెట్ కు 99 పరుగులు జోడించిన బాబర్-రిజ్వాన్ జోడీ టీ20ల్లో 19వ సారి 50 ప్లస్ పార్ట్ నర్ షిప్ నమోదు చేసిన జోడిగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో ఏ ఇతర జోడి కూడా ఇన్ని సార్లు ఈ ఘనత సాధించలేదు. టీమిండియా ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, కేఏ రాహుల్ టీ20ల్లో 15 సార్లు 50ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేశారు.
Also Read : Arvind Kejriwal: దేశం కోసం ప్రాణమైనా ఇస్తా.. సీబీఐ 100 సార్లు పిలిచినా సమాధానమిస్తా..
ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో బాబర్ ( 101 నాటౌట్ ), రిజ్వాన్ ( 34 బంతుల్లో 50: 6 ఫోర్లు, సిక్స్ ) చెలరేగడంతో పాకిస్థాన్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టీ20లో 4 వికెట్ తో న్యూజిలాండ్ వెన్ను విరిచిన హరీస్ రౌప్ ఈ మ్యాచ్ లోనూ 4 వికెట్లతో చెలరేగాడు.
తాజావార్తలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!