పదవీకాలం ముగియక ముందే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు అదనపు సమయం పొందేందుకు ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు ఆగస్టు 8న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాన పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ ఐదేళ్ల రాజ్యాంగ కాలపరిమితి ఆగస్టు 12 అర్ధరాత్రితో ముగియనుంది. అయితే, శాసనసభను రద్దు చేయడానికి అంగీకరించిన తర్వాత.. నాలుగు రోజులకు.. కానీ అంతకుముందే జాతీయ పార్లమెంట్ ను రద్దు చేసే అవకాశం ఉంది.
Read Also: Andhrapradesh: మద్యం తాగుదామని పిలిచి.. చితకబాది.. నోట్లో మూత్రం పోసి..
ఫెడరల్ ప్రభుత్వంలో రెండు ప్రధాన భాగస్వాములైన పాకిస్తాన్ పీపుల్స్, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ ఆగస్టు 8 న జాతీయ అసెంబ్లీని రద్దు చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఆగస్టు 9, 10 తేదీల్లో పార్లమెంట్ రద్దు గురించి చర్చకు వచ్చింది.. అయితే పార్లమెంటు దిగువ సభను త్వరగా రద్దు చేయడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఆగస్టు 8నే క్యాన్సిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రాజ్యాంగబద్ధంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తే 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
Read Also: PhonePe Offer : వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.950తో రూ.5 లక్షల బెనిఫిట్..
తమ పదవీకాలం పూర్తికాకముందే మధ్యంతర ప్రభుత్వం వస్తుందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బిలావల్ జర్దారీ-భుట్టో నేతృత్వంలోని పీపీపీ రాజ్యాంగ కాలపరిమితికి ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఎలాంటి తేదీని ఇంకా నిర్ణయించలేదని సమాచార శాఖ మంత్రి మర్రియుమ్ ఔరంగజేబ్ అన్నారు. పీడీఎం, ఇతర మిత్రపక్షాలతో చర్చించి ఓ డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు. ఒకసారి జాతీయ అసెంబ్లీ రద్దైన తర్వాత, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు షరీఫ్ కొద్ది రోజుల పాటు ప్రధానిగా తన విధులను కొనసాగించనున్నాడు.
Read Also: MP Komatireddy: కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ.. టీచర్ ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్
ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటు కోసం షరీఫ్ అసెంబ్లీని రద్దు చేసిన 48 గంటల్లోగా జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజా రియాజ్ కు ముగ్గురు పేర్లను సూచిస్తారు. అభ్యర్థి పేరుపై ఇద్దరు నేతల మధ్య మూడు రోజుల పాటు చర్చించిన తర్వాత.. జాతీయ అసెంబ్లీ స్పీకర్ అధికార, ప్రతిపక్షాల నుంచి సమాన ప్రాతినిధ్యంతో ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి ప్రధాని, ప్రతిపక్ష నేత చెరో ఇద్దరు నామినీలను పంపించనున్నారు. ఒక పేరుపై ఏకాభిప్రాయం కోసం కమిటీకి మూడు రోజుల టైం ఉంటుంది. అది కూడా విఫలమైతే రెండు రోజుల్లో తుది నిర్ణయం కోసం అభ్యర్థుల పేర్లను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఎంపికైన నామినీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ప్రధానిగా విధులు నిర్వహిస్తారు. కేబినెట్ సభ్యులను చేర్చుకునే అధికారం కూడా ఈ ఆపద్ధర్మ ప్రధానికి ఉంటుంది.