Pakistan: పాకిస్తాన్ దేశంలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులు, సిక్కులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ నగరంలో సిక్కు వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.
పారామిలటరీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో శనివారం నైరుతి పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.
Titan Tragedy: అట్లాంటిక్ సముద్రంలో మునిపోయిన టైటానిక్ షిప్ ను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయలుదేరిన ‘టైటాన్’ సబ్మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది. సముద్రం అడుగు భాగంలో 4 కిలోమీటర్ల లోతులో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తానీ బిజినెస్‌మ్యాన్ కూడా చనిపోయాడు. పాకిస్తానీ - బ్రిటిష్ ధనవంతుడు షాహజాదా దావూద్, అతని కుమారుడు 19 ఏళ్ల సులేమాన్ దావూద్ మరణించిన ఐదుగురిలో ఉన్నారు.
Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POJK) నుంచి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు.
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇఫ్స్ అండ్ బట్స్ లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్న అటువంటి దేశాలను కట్టడి చేయాలని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దానిని ఎదుర్కోవడంలో ఎలాంటి అపోహలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారత చట్టాలే అమలవుతున్నాయని ఆయన అన్నారు.
Najam Sethi quits PCB Chairman Race: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను పీసీబీ బోర్డులో శాశ్వత స్థానాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని నజమ్ సేథీ మంగళవారం స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపాడు. దాంతో ఛైర్మన్‌గా జకా అష్రాఫ్‌ను మరోసారి నియమించేందుకు మార్గం సుగమమైంది. ‘అందరికీ నమస్కారం. నేను…
గ్రీస్ పడవ విషాదంలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను పాకిస్తాన్ అరెస్టు చేసింది. గ్రీస్ తీరంలో మునిగిపోయిన ఒక పడవలో సుమారు 300 మంది పాకిస్తానీ పౌరులు మరణించినట్టు పాకిస్తాన్ ప్రకటించింది.
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్తున్నారు. మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రధాని మోడీకి వైట్ హౌజులో ఆతిథ్యం ఇవ్వనున్నారు.