పాకిస్థాన్ మాదీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్‌ఖాన్ సన్నిహితుడైన షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు అరెస్ట్ చేయడం దాయాది దేశంలో ప్రకంపనలు రేపుతోంది. అధికారిక రహస్యాల చట్టం కింద ఖురేషీని అదుపులోకి తీసుకోవడం ఈ సంచలనాలకు కారణమైంది.
BCCI Vice President Rajeev Shukla Gaves Clarity on Hyderabad hosting World Cup 2023 Matches: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న ఉండగా.. ఆ మరుసటి రోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ ఉంది. వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే.. సెక్యూరిటీపరంగా ఇబ్బందులు…
పంజాబ్‌లోని పాక్ సరిహద్దు వెంబడి ఇద్దరు పాక్ స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు ఫిరోజ్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇద్దరు పాకిస్తానీ స్మగ్లర్లను అరెస్టు చేశారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్‌లోని గుల్మిర్‌కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ కార్మికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్‌లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు.
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీని శనివారం అరెస్టు చేశారు. ఖురేషీని ఇస్లామాబాద్‌లో అరెస్టు చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెయ్యేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని, తన దేశం కోసం జైలు శిక్షను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ఓ నివేదికలో పేర్కొంది.
పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రిస్టియన్ మైనారిటీలపై ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. చర్చీలను ధ్వంసం చేస్తూ.. మైనారిటీల అణిచివేత చర్యలకు పాల్పడ్డారు.
Pakistan Petrol Price: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి.
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ శుభవార్త చెప్పింది. వన్డే వరల్డ్ కప్-2023 టికెట్ల అమ్మకానికి సంబంధించిన తేదీలను ఇవాళ ( మంగళవారం ) రిలీజ్ చేసింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల అమ్మకాల కోసం రిజిస్ట్రేషన్ దశ ఇది వరకే స్టార్ట్ కాగా.. ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది.
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ దేశానికి మద్దతు తెలుపుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.