Pakistan Minister: ఆర్థిక పేదరికంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు కూడా దెబ్బతిన్నాయి. ప్రతిరోజూ, పాకిస్తాన్‌లో దొంగలు బహిరంగంగా తుపాకీతో ప్రజలను దోచుకుంటున్నారు. దేశంలో క్రైమ్ రేట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ కేర్‌టేకర్ మంత్రి, బ్రిగేడియర్ (రిటైర్డ్) హరీస్ నవాజ్ ప్రజలకు ఆసక్తికర అభ్యర్థన చేశారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లను దొంగిలించలేని ప్రదేశాలలో ఉంచాలని మంత్రి కోరారు.
పాకిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లు లాక్కునే ఘటనలు పెరుగుతున్నాయి. ఫోన్ చోరీకి గురికాకుండా కాపాడేందుకు మంత్రి ఓ వింత సలహాను ఇచ్చారు. నేరాలను తగ్గించేందుకు పౌరులు కూడా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలన్నారు. ఫోన్‌ను దాచి జేబులో పెట్టుకోవాలని, తద్వారా మొబైల్‌లు దొంగిలించబడవని మంత్రి చెప్పారు.మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఈ ప్రకటనపై ఇంటర్నెట్‌లో చాలా మంది వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Also Read: New Parliament: ఈ నెల 19 నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు..?
విశేషమేమిటంటే, పాకిస్తాన్ ప్రభుత్వ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సంఘటన కాదు. గత సంవత్సరం, కరాచీ అప్పటి పోలీసు చీఫ్ జావేద్ ఆలం ఓధో నగరంలో నేరాలు పెరుగుతున్నాయనే వాదనలను ఖండించారు. అదే సమయంలో మీడియా ద్వారా అభద్రతా భావాన్ని సృష్టించినందుకు నగరంలోని వ్యాపార వర్గాలను నిందించారు. పాకిస్తాన్ వార్తా ఛానెల్ జియో న్యూస్ నివేదిక ప్రకారం, 2023 మొదటి మూడు నెలల్లో, కరాచీలో 21,000 కంటే ఎక్కువ వీధి నేరాల కేసులు నమోదయ్యాయి.