బలూచిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్- ఇరాన్ అంగీకరించాయి. తీవ్రవాద లక్ష్యాలపై ఇటీవలి ఘోరమైన వైమానిక దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి.
గత రెండు రోజులుగా పాకిస్తాన్- ఇరాన్ పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా ప్రతిపాదించింది. ఇరు దేశాలు సంయమనం పాటించడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండాలని డ్రాగన్ కంట్రీ కోరింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ గురువారం తెల్లవారుజామున దాడులు చేసి తొమ్మిది మందిని చంపింది.. ఇక, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సున్నీ బలూచ్ తీవ్రవాద గ్రూపు జైష్-అల్-అద్ల్ యొక్క రెండు…
రెండు రోజుల క్రితం టెహ్రాన్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ గురువారం ఇరాన్‌లోని సిస్తాన్-ఓ-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్లామాబాద్‌లోని ఒక ప్రకటనలో, పాకిస్తాన్ భద్రతా దళాలు సమన్వయంతో , నిర్దిష్ట లక్ష్యంగా ఖచ్చితమైన సైనిక దాడులను నిర్వహించాయని పేర్కొంది.
Ram Mandir: జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. గురువారం రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సాధువులతో సహా మొత్తం 7000 మంది అతిథులు హాజరవుతున్నారు.
Pakistan attacks Iran: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. గురువారం రోజు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిజరేషన్ ఆర్మీ వేర్పాటువాద గ్రూపుల పోస్టులపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు సమాచారం.
Iran's strikes in Pakistan: పాకిస్తాన్‌పై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్తాన్ లోని కీలమైన రెండు ప్రాంతాలపై వైమానికి దాడులకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఉగ్రవాదం పట్ల ఇరాన్ స్పందించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డజను కోడి గుడ్లు రూ.400కి పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లికి రూ.250 చెల్లించాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలు నెలకొంది.
Pakistan : పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని జైష్-అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
పాకిస్థాన్ ప్రజలు మరోసారి ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో ధరలకు సంబందించిన వివరాలను లాహోర్‌లో పాక్ ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు పాక్ సైనికులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది.