Pakistan : భారీ వర్షాల కారణంగా పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే పరిస్థితి నెలకొంది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి వరసగా అక్కడి కోర్టులు శిక్షల్ని విధిస్తున్నాయి. తాజాగా ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధంగా వివాహం చేసుకున్నాడనే కేసులో ఆయనకు, అతని భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు శనివారం 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2022 నుంచి ఇది ఇమ్రాన్ ఖాన్‌పై నాలుగో ఆరోపణ. అయితే, రెండు వరస వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం (ఇద్దత్) పాటించాలనే ఇస్లామిక్ ఆచారాన్ని ఆరోపిస్తూ బుష్రా బీబీ మొదటి భర్త…
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్లో అబోట్టాబాద్‌లో బిన్ లాడెన్‌ని చంపేశారు. తాజాగా జియో న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య పొరుగు దేశం పాకిస్తాన్ మాల్దీవులకు మద్దతుగా ముందుకు వచ్చింది. మాల్దీవుల అభివృద్ధి పనుల్లో సాయం చేస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.
Former Pakistan PM Imran Khan get 14 year jail in Toshakhana Case: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే పదేళ్ల శిక్ష పడగా.. తాజాగా తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోజు వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసులలో జైలు శిక్ష పడడం విశేషం. తోషఖానా కేసులో ఇమ్రాన్…
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మరణించారు.
Former Pakistan PM Imran Khan sentenced to 10 years in jail: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడు దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా ఇదే కేసులో పదేళ్ల శిక్ష…
INS Sumitra Rescues 19 Pakistani nationals form Somali Pirates: భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన 19 మంది పాకిస్తానీ నావికులతో కూడిన ఓడను రక్షించింది. అల్ నయీమీ అనే ఫిషింగ్ నౌకపై జరిగిన దాడిని ఐఎన్ఎస్ సుమిత్ర అడ్డుకుంది. 11 మంది సోమాలియా సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్తానీ సిబ్బందిని ఐఎన్ఎస్ సుమిత్ర…
Iran-Pakistan: ఇరాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ఇటీవల పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సుపై వైమానిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ లోని సిస్తాన్ బలూచిస్తాన్‌పై పాక్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల ఇరాన్ లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో 9 మంది పాకిస్తాన్ జాతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.