Imran Khan vs Asim Munir: అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రావల్పిండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు అధికారులు, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లు మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రకటన ఇవ్వడం కూడా పరిస్థితిని చక్కబడేలా చేయలేదు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని, ఆయనను పాకిస్తాన్ ఆర్మీ హత్య చేసిందనే వార్తలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు.
Pakistan: పాకిస్తాన్‌లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘ఆసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది.
Saad Rizvi Missing: పాకిస్థాన్‌లో ఇటీవల తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో TLP ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనల ఫలితంగా పౌరులు, పోలీసు అధికారులు మరణించారు. ఇది జరిగిన తరువాత TLP చీఫ్ సాద్ రిజ్వి అదృశ్యం అయినట్లు సమాచారం. వాస్తవానికి ఆయన కోసం ప్రస్తుతం దాయాదీ పోలీసులు అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు..? READ ALSO: YS Jagan: చంద్రబాబు గారూ.. ఒక్క…
PoK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జనం తిరగబడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సంవత్సరాల తరబడి పాకిస్తాన్ దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. అయితే, ప్రతీసారి పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది.
Asim Munir: పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్‌గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్‌ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం…
Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్‌లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్‌ను వారు ప్రయోగించినా,…
Pakistan : ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల నుంచి పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. దేశంలో ఎక్కడ చూసినా నిరసనలు, రాజకీయ సంక్షోభం ముదురుతున్నాయి.
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగా లేదు. అక్కడ ప్రభుత్వం, సైన్యం, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఆ దేశం బతికీడుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం పాక్ ను మరింత కల్లోలానికి గురిచేస్తోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విడుదలైనా.. కూడా ఆందోళనలు సద్దుమణగడం…
Imran Khan Arrest: అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ రేంజర్లు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతటా ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని పీటీఐ దేశప్రజలకు పిలుపునిచ్చింది. ఇక దేశరాజధాని ఇస్లామాబాద్ అంతటా నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో నిషేధిత ఆర్డర్స్ పాస్ చేశారు.