Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని, ఆయనను పాకిస్తాన్ ఆర్మీ హత్య చేసిందనే వార్తలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇటీవల ఇమ్రాన్ అక్కాచెల్లెళ్లు ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. చివరకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు సీఎంను కూడా అధికారులు అనుమతించలేదు.
Read Also: Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం..
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రమైంది. మంగళవారం రాత్రి పాకిస్తాన్ అంతటా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారని ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే, వరస పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమయ్యారు. రావల్పిండిలోని అడియాలా జైలు ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.