Pakistan: పాకిస్తాన్‌లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘అసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది. అయితే, గతంలోని తిరుగుబాట్లకు అసిమ్ మునీర్ తిరుగుబాటుకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గతంలో సైన్యం ద్వారా తిరుగుబాటు జరిగితే, ఈసారి మాత్రం రాజ్యాంగ మార్పు ద్వారా ‘‘రాజ్యాంగబద్ధం’’గా జరిగింది.
షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని తొలుబొమ్మ సర్కార్, అసిమ్ మునీర్‌ను పాకిస్తాన్‌కు ‘‘సుప్రీం లీడర్’’ను చేసింది. సోమవారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ 27వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. ఇది సైనిక ఆధిపత్యాన్ని చట్టబద్ధం చేస్తుంది. దీంతో కమాండ్ కంట్రోల్, అణు అధికారం, న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియంత్రణలోకి వచ్చాయి.
పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అయూబ్ ఖాన్ (1958), జియా-ఉల్-హక్ (1977), పర్వేజ్ ముషారఫ్ (1999) చేసిన మూడు సైనిక తిరుబాట్లు చేసి, పాక్ అధ్యక్షులుగా పనిచేశారు. తాజాగా, పాక్ మరోసారి అసిమ్ మునీర్ నేతృత్వంలో మరో తిరుగుబాటు జరినట్లే కనిపిస్తోంది. నిజానికి ప్రధాని ఆదేశాల మేరకు ఆర్మీ చీఫ్ నడుచుకోవాలి, కానీ ఇప్పుడు పాక్‌లో అసిమ్ మునీర్‌కు సహాయకుడిగా షహబాజ్ షరీఫ్ ఉండబోతున్నారు. ఇప్పుడు పాక్‌లో మునీర్ సర్వోన్నతుడిగా మారాడు. తన లాంటి 5-స్టార్ జనరల్స్ ఇకపై చట్టపరమైన చర్యల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. వీరంతా చట్టానికి అతీతులుగా ఉంటారు.
Read Also: Montha Cyclone Damage: సీఎంతో కేంద్ర బృందం భేటీ.. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలంటూ..
అసిమ్ మునీర్ ప్రమాదకర కుట్ర:
అసిమ్ మునీర్‌కు పాలక వర్గం పూర్తిగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. పాక్‌లో ఇకపై రెండు సమాంతర పాలనలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వం, మరొకరటి ఆర్మీ. చివరకు అంతిమ నిర్ణయం మాత్రం సైన్యానిదే అవుతుంది. పాకిస్తాన్‌లో జనరల్ జియా ఉల్ హక్ 1977లో ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేసి, అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. భుట్టోను ఒక హత్య కేసులో ఇరికించి, ఉరి తీయించాడు. 10 ఏళ్ల పాటు పాక్‌లో మార్షల్ లా కొనసాగింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇస్లామీకరించాడు. 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఇదే తీరుగా వ్యవహరించాడు. ప్రధాని నవాజ్ షరీఫ్ ను తొలగించాడు. ఇది పాక్‌లో అవినీతి, స్థిరత్వం కోసం తీసుకున్న నిర్ణయంగా సమర్థించుకున్నాడు.
అయితే, మునీర్ కుట్రం చాలా ప్రమాదకరమైందిగా పరిశీలకులు భావిస్తున్నారు. చట్టబద్ధంగా పాకిస్తాన్‌ను పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంటుంది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవాల్ చేస్తే, కొత్త బిల్లు సైన్యం వాస్తవ ఆధిపత్యాన్ని అధికారికంగా చేస్తుంది. అధ్యక్షుడు, మంత్రివర్గం నుంచి అధికారాలు కొత్తగా ఏర్పడిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)కి మారుతాయి. ఈ సవరణలు పాక్ సైన్యాన్ని బలోపేతం చేయకుండా, ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూరేలా చేస్తుందని మాజీ రక్షణ కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ ఆసిఫ్ యాసిన్ మాలిక్(రిటైర్డ్) చెప్పారు. గతంలో ఆర్టికల్ 243 ద్వారా అధ్యక్షుడికి సుప్రీంకమాండర్ హోదా ఉండేది, ఆయన కింద ప్రభుత్వం కార్యచరణ నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇది రద్దు అయింది.
సైన్యంలో చీలికకు అవకాశం:
ఆర్మీకి చెందిన ఒక వ్యక్తికి అత్యున్నత అధికారాలు కట్టబెట్టడం, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో విబేధాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇది అన్ని శాఖల మధ్య సమన్వయం దెబ్బతీస్తుందని లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ అన్నారు. అణు నిబంధనలు మునీర్ ను మరింత శక్తివంతం చేస్తుంది. సమర్థవంతమైన అణ్వాయుధాలు ఆర్మీ నియంత్రణలో ఉంటాయి. నేవీ కిందకు వచ్చే సెకండ్ స్ట్రైక్ క్షిపణులు కూడా ఆర్మీ కిందకే వస్తాయి. ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సమస్యలను, సమన్యయ జాప్యాలకు దారి తీస్తుంది.