Pakistan: పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు రూ.600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తాజాగా ఈ సమస్య పార్లమెంటులో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు.
Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ని, తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ రోడ్డు, రైలు నెట్వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) చేపట్టింది. ఇప్పటికే బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును డెవలప్ చేసింది.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
India VS Pakistan: భారత్, పాకిస్తాన్ ఒక రోజు వ్యవధితో 1947 ఆగస్టులో స్వాతంత్య్రాన్ని పొందాయి. ఒకప్పుడు, భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు, భారత్ ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపు, పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్లు, బాంబులు, అప్పుల్లో కూరుకుపోయింది.
India Pakistan: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అప్పుల కోసం పలు దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి భిక్షం అడుక్కుంటోంది. రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలపై ఎక్కువగా ఆధారపడుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బ తీసేలా భారత్ ప్లాన్ చేస్తోంది.
శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం రాత్రిపూట దానిని ఉల్లంఘించి భారత్ పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. భారత సైన్యం దాడులను తిప్పికొట్టింది. పాకిస్తాన్ స్వయంగా దివాలా అంచున ఉన్న సమయంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1 బిలియన్ల సహాయాన్ని అందుకుంది. నిజానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా దారుణమైన స్థితిలో ఉంది. Also Read:Mrunal Thakur : ఆ క్షణం…
Shehbaz Sharif: తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మతఛాందసవాదంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పెద్దపెద్ద సవాళ్లు చేస్తోంది. ఏ దశలోనూ భారత్‌తో పోలిక లేదు, అయినా భారత్‌ని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. తినడానికి తిండి లేకపోయినా, కింద కోట్ల అప్పులు ఉన్నా కూడా వాస్తవాలను మరిచి ప్రవర్తించడం పాకిస్తాన్‌కే చెల్లుతోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
Chandrayaan : చైనా శుక్రవారం తన చంద్రుని పరిశోధన మిషన్ చాంగ్-6 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 05:27 గంటలకు దీన్ని ప్రయోగించనున్నట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) ఈ సమాచారం ఇచ్చింది.
పాకిస్థాన్ ప్రజలు మరోసారి ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో ధరలకు సంబందించిన వివరాలను లాహోర్‌లో పాక్ ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Pakistan Petrol Price: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి.