దాయాది దేశమైన పాక్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ మొత్తం అప్పులు ఏడాది ప్రాతిపదికన 34.1 శాతం పెరిగి ఏప్రిల్ చివరి నాటికి రూ. 58.6 ట్రిలియన్లకు చేరుకున్నాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక తెలిపింది.
Pakistan:ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో పాకిస్తాన్ సతమతం అవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు అధిక ధరలు, కొందాం అనుకున్నా నిత్యవసరాలు అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు కరెంట్, ఇంధన సమస్యలతో పాక్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేస్తున్నారు.
Pakistan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో ప్రభుత్వం ఉన్నా.. లేని విధంగా తయారైంది అక్కడి పరిస్థితి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రభుత్వం, సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ రోజూ అక్కడ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతాల్లో వేర్పాటువాదం పెరిగింది. ఇన్ని సమస్యల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది.
Imran Khan: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచుకు చేరిన పాకిస్తాన్ పరిస్థితి, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతోంది. అక్కడి ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన అరెస్ట్ సమయంలో, ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగా లేదు. అక్కడ ప్రభుత్వం, సైన్యం, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఆ దేశం బతికీడుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం పాక్ ను మరింత కల్లోలానికి గురిచేస్తోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విడుదలైనా.. కూడా ఆందోళనలు సద్దుమణగడం…
Imran Khan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. రాజకీయంగా కూడా పతనావస్థలో ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, అక్కడి షహజాబ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరోవైపు సైన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు తీవ్ర ఒత్తడిలో ఉన్నాయి. దీనికి తోడు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరగడం పాకిస్తాన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుపుతోంది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కీలక ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన కీలక నేతలను కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. పీటీఐ పార్టీ ఇన్స్టాగ్రామ్ హెడ్ అత్తౌర్ రెహ్మాన్ గురువారం తెల్లవారుజామున లాహోర్ నుండి కిడ్నాప్ కు గురయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పై వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన తర్వాత ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీసుల సహకారంతో…
Pakistan: పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా నెమ్మదిగా ఆ దేశంలో తమ వ్యాపారాలను మూసేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాదం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాక్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులు భయంతో పనులు చేస్తున్నారు. చివరకు చైనా తమ పౌరులు సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని…
Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం,
Pakistan: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇతర దేశాలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ దేశంలో స్వీడన్ తన రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసేసింది. వీసాలు, ఇతర దౌత్యసంబంధాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా కూడా ఇతర దేశాలు నమ్మడం లేదు. ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది.