ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. రేపు భారత్-పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పై ఓటమిని చవి చూసింది. దీంతో.. రేపు టీమిండియాతో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకం కానుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ టీంకు కొత్త కోచ్‌ను నియమించుకుంది.
Read Also: Shaktikanta Das: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ నియామకం..
పాకిస్తాన్ టీం కొత్త కోచ్‌గా ముదస్సర్ నాజర్ బాధ్యతలు చేపట్టారు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ఉద్దేశంతో కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. క్రికెట్ కోచ్‌గా అనుభవం ఉన్న నాజర్‌కు దుబాయ్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా.. దుబాయ్ లోని ఐసీసీ గ్లోబల్ అకాడమీలోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దుబాయ్ పిచ్ పై భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ విజయానికి అతను కీలకంగా మారతాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. టీం ఇండియాపై నెగ్గాలనే కొత్త కోచ్ ను నియమించుకున్నారు. కోచ్ ఆకిబ్ జావేద్‌ను తప్పించి.. నాజర్‌కు కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
Read Also: Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు నేను రెడీ..