Taliban – Islamabad: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇకపై పాకిస్థాన్ నుంచి ఏవైనా దాడులు జరిగితే ఆఫ్ఘనిస్థాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని తాలిబన్ భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ ఆఫ్ఘన్ భూభాగంపై బాంబు దాడి చేస్తే, తాలిబన్లు ఇస్లామాబాద్‌ను లక్ష్యంగా చేసుకుంటారని స్పష్టం చేశాయి. వాస్తవానికి ఆఫ్ఘన్ చర్చలకు కట్టుబడి ఉంది. కానీ పాకిస్థాన్ ప్రతినిధి బృందం ఆఫ్ఘన్‌తో చర్చలకు సహకరించలేదు, చర్చలకు బదులుగా…
Afghan-Pakistan War: వెన్నుపోటు పొడవడం పాకిస్తాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇది మరోసారి నిజమైంది. ఆఫ్ఘానిస్తాన్ దాడులకు తాళలేక, మధ్యవర్తిత్వం చేసి, దాడుల్ని ఆపేలా చేయాంటూ సౌదీ అరేబియా, ఖతార్‌లను పాకిస్తాన్ వేడుకుంది. శుక్రవారం, ఖతార్ వేదికగా పాక్, తాలిబాన్ అధికారుల మధ్య మరో 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం పొడగించాలని నిర్ణయం కుదరింది. Read Also: Tripura: పశువుల్ని దొంగిలించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం.. అయితే, దీనిని పట్టించుకోని పాకిస్తాన్…
Pak- Afghan war: ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్ తమ దేశ రాజధాని కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై బాంబు దాడులు చేసిందని ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.
Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్‌లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది.
Pakistan Afghanistan war: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే దాయాదిదేశం పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా ఆఫ్ఘన్ స్పందించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థన్, పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 9న పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, పాక్టికాలో TTP చీఫ్ నూర్ వలీ మెహ్సుద్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. తాజాగా పాకిస్థాన్ వైమానిక దాడులకుఆఫ్ఘనిస్థన్…
Afghanistan: అక్టోబర్ 9న, పాకిస్థాన్ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, ఇతర నగరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ అంశంపై తాలిబాన్ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈ దాడిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాలిబాన్లకు వాయు రక్షణ ఉందా..? అమెరికా వదిలిపెట్టిన ఆయుధాలతో వారు ఏమి చేస్తున్నారు..? తాలిబన్ల దగ్గర ఫైటర్ జెట్లు, క్షిపణులు ఉన్నాయా..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్‌గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.