Afghanistan: అక్టోబర్ 9న, పాకిస్థాన్ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, ఇతర నగరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ అంశంపై తాలిబాన్ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈ దాడిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాలిబాన్లకు వాయు రక్షణ ఉందా..? అమెరికా వదిలిపెట్టిన ఆయుధాలతో వారు ఏమి చేస్తున్నారు..? తాలిబన్ల దగ్గర ఫైటర్ జెట్లు, క్షిపణులు ఉన్నాయా..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
వాస్తవానికి.. తాలిబన్ల వద్ద ఆధునిక యుద్ధ విమానాలు లేదా క్షిపణులు లేవు. గ్లోబల్ ఫైర్‌పవర్ 2025లో ఆఫ్ఘనిస్థాన్ సైనిక ర్యాంకింగ్ 118వ స్థానంలో ఉంది. అంటే చాలా బలహీనంగా ఉంది. 1990ల నాటి కొన్ని పాత MiG-21, Su-22 యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ చాలా వరకు పేలవమైన స్థితిలో ఉన్నాయి. నిర్వహణ లోపం ఉంది. క్షిపణి వ్యవస్థలు కూడా ప్రాథమికమైనవి. అధునాతన బాలిస్టిక్ లేదా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు లేవు. అందుకే.. తాలిబన్లు ఎక్కువగా భూ బలగాలపై ఆధారపడతారు. కానీ.. రష్యన్లు టోర్-ఎం2 వంటి వైమానిక రక్షణ వ్యవస్థలను కోరుకుంటున్నారు.
READ MORE: Trump 100% Tariff: చైనా దిగుమతులపై 100% టారిఫ్స్
దాడి అనంతరం తాలిబన్లు మౌనంగా ఉన్నారు. తాలిబన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీ పర్యటన సందర్భంగా కాబూల్ పై జరిగిన మొదటి పాకిస్థాన్ దాడి ఇది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబన్లను TTP కి ఆశ్రయం ఇవ్వవద్దని హెచ్చరించారు. 2024 లో చేసినట్లుగా తాలిబన్లు ప్రతీకారం తీర్చుకోవచ్చు. తాలిబన్లు పాకిస్థాన్‌లోని అనేక ప్రదేశాలపై దాడులు చేయొచ్చు. అయితే, వైమానిక దాడులకు ప్రతిస్పందించడం కష్టం ఎందుకంటే తాలిబన్లకు బలమైన వైమానిక దళం లేదు. వారు భూ దాడులతో లేదా దౌత్యంతో ప్రతిస్పందించే అవకాశం ఉంది. ఇది ఆఫ్ఘన్-పాక్ మధ్య ఉద్రిక్తతలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.