Pak- Afghan war: ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్ తమ దేశ రాజధాని కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై బాంబు దాడులు చేసిందని ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.
READ MORE: Minister Lokesh: విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించడమే మా లక్ష్యం..
అలాగే ఉగ్రవాద సంస్థ ఐసీస్‌ను పాకిస్థాన్ నుంచి బహిష్కరించాలని జబీహుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు. “పాకిస్థాన్ లో దాక్కున్న ముఖ్యమైన ISIS సభ్యులను బహిష్కరించాలి లేదా వారిని ఇస్లామిక్ ఎమిరేట్‌కు అప్పగించాలి. ISIS గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పు కలిగిస్తుంది. ఇస్లామిక్ ఎమిరేట్ తమ భూభాగంలో అశాంతి కలిగించే వాళ్లను బహిస్కరించింది. కానీ వారి కోసం పాకిస్థాన్‌లోని పష్తుంఖ్వాలో కొత్త కేంద్రాలను స్థాపించారు. శిక్షణ కోసం కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు.” అని ముజాహిద్ అన్నారు. ఇరాన్, రష్యాలో దాడులకు కూడా పాకిస్థాన్ కేంద్రాల నుంచే ప్రణాళికలు వేశారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులకు సైతం ఈ కేంద్రాల నుంచే ప్రణాళికలు రచిస్తున్నారని.. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
READ MORE: Laptop Deals: అమెజాన్ దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్లు.. HP, Acer ల్యాప్‌టాప్‌లపై క్రేజీ డీల్స్
కాగా.. పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్‌లోని టోలో న్యూస్.. పెద్ద ఎత్తున పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది. కాందహార్‌లోని మైవాండ్ జిల్లాలో ఐదుగురు పాకిస్థాన్ సైనికులు ఇస్లామిక్ ఎమిరేట్ దళాలకు లొంగిపోయినట్లు నివేదిస్తోంది. ఇంతలో, పాకిస్థాన్ మీడియా సంస్థలు మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయి. పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటుండగా.. దాయాది దేశానికి చెందిన దున్యా న్యూస్ అనేక ఆఫ్ఘన్ పోస్టులను నాశనం చేసి, డజన్ల కొద్దీ ఆఫ్ఘన్ సైనికులు మరణించారని పేర్కొంది. అనేక ఆఫ్ఘన్ పోస్టులు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. అనేక ఆఫ్ఘన్ పోస్టులను ఫిరంగి, ట్యాంకులు, వైమానిక దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. పాకిస్థాన్ ట్యాంక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి.