Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కీలక సూత్రధారులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్, నిఘా, భద్రతా సంస్థల సంయుక్త దర్యాప్తులో ఆపరేషన్‌కి సంబంధించిన పాక్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయి.
Pahalgam attack: పహల్గామ్ దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి కొన్ని రోజులు ముందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్నవారికి సాయం చేస్తామని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఉంటుందని చెప్పారు.
కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న వేళ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్ లో టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అధికార వర్గాల ప్రకారం 28 మందిని పొట్టనబెట్టుకున్నారు. ముష్కరుల కాల్పులతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగింది. అక్కడి స్థానికులు భయంతో వణికిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి రోధనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉగ్రదాడిని ట్రంప్ తో సహా ప్రపంచ ప్రముఖులు ఖండించారు. ఉగ్రవాదుల దాడులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను…
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం సుస్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం కాశ్మీర్ అందాలను చూసేందుకు పహల్గామ్ బైసరీన్ గడ్డి మైదానాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్ని ఇస్లామిక్ టెర్రరిస్టులు దారుణంగా చంపేశారు. మతం, పేరు అడుగుతూ మరీ హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి 10 గంటలకు వైజాగ్‌కు వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళులర్పించనున్నారు. ఆపై చంద్రమౌళి కుటుంబసభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి మరీ చంపిపారు. చంపొద్దని వేడుకున్నా.. ఉగ్రమూకలు వినకుండా చంద్రమౌళిని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం తెలిసిన వెంటనే వైజాగ్ నుంచి కుటుంబసభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు. చంద్రమౌళి మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు…
పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జనసేన అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరం దృఢంగా ఉందాం అని, మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారి గౌరవార్థం జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళవారం…
పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో భారతీయలు పోస్టులు పెడుతున్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నేడు ఐపీఎల్ ప్లేయర్స్ నల్ల రిబ్బన్లతో…
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మరణించారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్‌కు చెందిన మధుసూదన్ ఉద్యోగరీత బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మధుసూదన్‌కు 42 బుల్లెట్లు తగిలినట్లు సమాచారం తెలుస్తోంది. Also Read: AP SSC Results 2025: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..…
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం…