జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మరణించారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్‌కు చెందిన మధుసూదన్ ఉద్యోగరీత బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మధుసూదన్‌కు 42 బుల్లెట్లు తగిలినట్లు సమాచారం తెలుస్తోంది.
Also Read: AP SSC Results 2025: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
మధుసూధన్ తల్లిదండ్రులు తిరుపాలు, పద్మావతిలు వెంగళరావు నగర్‌లో నివాసం ఉంటున్నారు. అరటికాయల వ్యాపారం చేసుకునే తిరుపాలు కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉన్న మధుసూదన్.. పహల్గాంలో విహారయాత్రకు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో మరణించారు. దీంతో ఆయన కుటుంబం పహల్గాం బయలుదేరి వెళ్లింది. మధుసూదన్ మృతదేహం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటుందని, అనంతరం అక్కడి నుంచి కావలికి తీసుకువస్తారని పోలీసులు చెబుతున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో విశాఖపట్నం వాసి చంద్రమౌళి కూడా మృతి చెందారు.