India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కి భారత్ షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా దెబ్బతీసింది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై అణిచివేత చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తానీ యాక్టర్లు, సెలబ్రెటీలకు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. నటి మహిరా ఖాన్, హనియా అమీర్, అలీ జాఫర్ సహా ప్రముఖ పాకిస్తానీ యాక్టర్ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను బుధవారం భారత్ బ్లాక్ చేసింది.
Read Also: Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..
గత మంగళవారం, పహల్గామ్ లో కాశ్మీర్ అందాలను వీక్షిస్తున్న అమాయకపు టూరిస్టులపై పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు. మతం ఆధారంగా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు. ఈ దాడికి పాల్పడిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయులు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌పై దౌత్య, ఆర్థిక చర్యలు మొదలయ్యాయి. మిలిటరీ యాక్షన్‌కి కూడా భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.