ఆరు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సెక్రటేరియట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక మార్కెట్ ల నుండి కార్మికులను సమీకరించుకోవాలని , గోనె సంచులు (గన్నీ బ్యాగ్స్) సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యం రవాణాకు వాహనాలు తగినంతగా లభించేలా చూడాలని, మిల్లర్లు తూకాలలో విధిస్తున్న అనవసర కోతలను అరికట్టేందుకు తనిఖీలు చేయాలని వారికి సూచించారు. గోనె సంచుల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. విత్తనాలు మరియు ఎరువులు విక్రయాల సమయంలో తగినంత నిల్వలు అందుబాటులో ఉండాలని తెలిపారు. తదనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులతో సవివరమైన సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. సూపర్ స్ప్రెడర్ కేటగిరీల కోసం ప్రతిపాదించిన టీకా డ్రైవ్‌కు సంబంధించి, ప్రభుత్వం నిర్దేశించిన వర్గాలకు టీకాలు వేయాలని, లైన్ జాబితాను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లకు సూచించారు. అంతేకాకుండా, ఈ వర్గాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే వేయడాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
Also Read
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
తాజావార్తలు
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!