వైఎస్ షర్మిల రెండోరోజు పాదయాత్ర ముగిసింది. అక్టోబర్ 20 వతేదీ నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. శంషాబాద్ మండలంలోని క్యాచారం వరకు ఈ యాత్ర సాగింది. ఈరోజు షర్మిల పాదయాత్ర 12 కిలోమీటర్లమేర సాగింది. ఈరోజు క్యాచారంలోనే షర్మిల బసచేయనున్నారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా, ఇప్పటి వరకు మొత్తం 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.…
వైఎస్ షర్మిల ఈరోజు నుంచి ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. చేవెళ్ల నియోజక వర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది. ఈ యాత్రకు ముందు వైఎస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె తప్పుపట్టారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీపై షర్మిల విరుచుకుపడ్డారు. తాము దీక్షలు చేస్తేనే కేసీఆర్‌కు ఉద్యోగ భర్తీలు గుర్తుకు వస్తాయని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌ను అరువుతెచ్చుకొని అధ్యక్షుడిని చేసిందని,…
వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. చేవెళ్లలో జెండా ఊపి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ విజయమ్మ. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నాన్న ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశిస్తామని చెప్పారు. వైఎస్.ఆర్ నాయకత్వాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని… సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకువస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతానానికే ఈ యాత్ర అని… కోట్ల అప్పులు…
పాదయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. ఆయన కంటే ముందు.. ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అయినా పాదయాత్రలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి రావడానికి వైఎస్ అనుసరించిన ఈ ఫార్మూలా ఆ తర్వాత ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్ఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేపట్టిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం…
తెలంగాణలో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు కొనసాగింపుగా.. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేశారు షర్మిల.. ఇప్పుడు.. తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ఆమె.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు.. ఇప్పటికే ప్రతీవారం నిరుద్యోగ దీక్ష కొనసాగిస్తూ వస్తున్న ఆమె.. ఇక, వచ్చే నెల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.. ఇవాళ తన పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించారు షర్మిల.. తన తండ్రి,…
పాదయాత్ర చేస్తే.. అధికారం ఖాయమా? ఎన్నికలకు ముందు జనాన్ని నేరుగా కలిస్తే.. గెలుపు తనంతట తానే మన దగ్గరకు వస్తుందా? గతంలోని ఉదాహరణలు చూపించి.. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. అందుకు 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నాంది పలికిందనే చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో.. ఆయన చేసిన పాదయాత్ర.. సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ ను పూర్తి స్థాయి మెజారిటీతో…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర పేరును ఈరోజు ఖరారు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పేరును ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రాజా సంగ్రామ యాత్ర పేరుతో ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను చేపట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పాదయాత్రకు సంబందించిన రూట్మ్యాప్ను ఖరారు చేసిన బీజేపీ, యాత్ర పేరు కూడా ప్రకటించడంతో…