పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్.. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో…
Vijay : తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (2026) సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ రూపు రేఖల మీద దృష్టిపెట్టారు.
మల్లాది విష్ణు వర్గం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ పాదయాత్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 25న తన వర్గంతో మల్లాది విష్ణు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో ఏం చేయాలనే దానిపై విష్ణు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు పార్ట కేడర్ చెబుతుంది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బీఆర్ఎస్ సర్కారును కదిలించింది. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం కేసీఆర్ ను ప్రజల వద్దకు పరుగులు తీసేలా చేసింది. పోడు భూముల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఈనాడు పట్టాలు పంపిణీ చేయడం పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై భట్టి చేసిన పోరాట ఫలితమే. ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో సరికొత్త ప్రజా విప్లవోద్యమంలా మారింది.
సాయంత్రం భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మరో 24 గంటలు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. జ్వరం నార్మల్ గా ఉన్నప్పటికీ.. బాగా నీరసంగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ లు కూడా నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే రేపు క్లినికల్ పరీక్షల తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి సంబంధీకులు చెబుతున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. గుర్రంపోడు మండలం పాల్వాయి శివారులోని లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలను సీఎల్పీ నేత కలిశారు.
ఎడమ కాలికి గాయం కావడతో డాక్టర్లు 15 నుంచి 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో పాదయాత్రను కొద్ది రోజులు పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
హాత్ సే హాత్ జొడో లో భాగంగా నేను కూడా యాత్ర చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జిల్లాలో పాదయాత్రకి జగ్గారెడ్డి అనుమతి కోరారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.