బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పై ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ నెల 24 నుండి పాదయాత్ర మొదలు పెడుతున్నానని… భాగ్యలక్ష్మి అమ్మ వారి దేవాలయం నుండి ప్రారంభం కానుందని ప్రకటించారు. పాదయాత్రను ప్రకటించిన వెంటనే మేమూ నడుస్తామంటూ స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఒక్కో జిల్లా నుండి 20 మంది మాత్రమే పాదయాత్రలో నడిచేందుకు అవకాశాన్ని కల్పించామని.. పూర్తి సమయం…
తెలంగాణలో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రతో మరోసారి పాదయాత్రలు తెరమీదకు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఆ తరువాత 2014లో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేపట్టారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగిస్తారా? రద్దు చేసుకుంటారా? వాయిదా వేస్తారా? అనే చర్చ మొదలైంది.. వీటికి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. 12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన పాదయాత్ర జరిగిందని.. ఈ యాత్రలో ప్రతిక్షణం నా…
పాకిస్తాన్‌లో మతమార్పిడులు సహజం. అక్కడ ఇతర మతస్థులను ఇస్లామ్ మతంలోకి బలవంతంగా మారుస్తుంటారు. అయితే, హిందువులు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా మతమార్పిడిలు జరుగుతున్నాయి. దీనికోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జాబితాలో మీరట్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ పేరు మతం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్లడంతో ఏటీఎస్ పోలీసులు అతడిని విచారణ జరిపారు. ఎటీఎస్…
తెలంగాణలో పాదయాత్ర సీజన్ వచ్చేస్తోంది.. కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారని తెలుస్తుండగా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్ర తేదీని ప్రకటించారు.. మరోవైపు.. తాజాగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల కూడా.. రేపోమాపో పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చేరారు.. తనపై అభియోగాలు…
రాజకీయాల్లో పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. గతంలో నాయకులు అధికారంలోకి వచ్చేముందు పాదయాత్రలు చేసిన సందర్బాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు నేతలు అధికారంలోకి వచ్చేముందు పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రల కారణంగా వారు అధికారంలోకి వచ్చారు. 2019లో జరిగిన ఎన్నికలు ముందు ఓ యువనేత పాదయాత్ర చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో పాలన చేతులు మారింది. కాగా, ఇలాంటి పాదయాత్ర ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతున్నది. Read: వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్…
తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డికి పగ్గాలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహాం కనిపిస్తోంది. ఈ జోష్ ను ఇలానే కంటిన్యూ చేయడానికి పక్క ప్రణాళికతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 33 జిల్లాలను మొత్తం చుట్టేలా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతోపాటు తన సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడం ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని…
ఈటల రాజేందర్ రాకతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ… మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర కార్యవర్గం. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి సంజయ్ జిల్లాల పర్యటనతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చ జరుగనుంది. జూలై 1 నుంచి 8 వరకు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేయనున్నారు.…