ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి! ఆయన ఆహ్లాదకర రచలే కాదు… భిన్నమైన నవలలూ రాశారు. నిజం చెప్పాలంటే మల్లాది టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఆయన నవలలు అనేకం సినిమాలుగా వచ్చి మంచి విజయం సాధించాయి. మల్లాది రాసిన ‘9 అవర్స్’ అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి షో రన్నర్ గా అదే పేరుతో ఓ వెబ్ సీరిస్ తాజాగా రూపుదిద్దుకుంది. ఇది జూన్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్…
ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘కిరోసిన్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మించారు. దర్శకుడు ధృవ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, ‘కేరాఫ్ కంచరపాలెం’ రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘కిరోసిన్’ మూవీని…
పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ నుంచి వచ్చిన ట్రిపుల్ ఆర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే ఓటిటిలో నెంబర్ వన్ ప్లేస్లో దూసుకుపోతోంది. అయితే తెలుగులో భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్యకు.. థియేటర్లోనే కాదు, ఓటిటిలో కూడా భారీ ఎదురుదెబ్బే పడిందట. మరి ట్రిపుల్ ఆర్ ఓటిటిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఆచార్య పరిస్థితి ఎలా ఉంది..? దర్శక ధీరుడు తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.…
మెగాస్టార్ చిరంజీవి కు ఓటిటీ లో ఘోర అవమానం జరిగిందా ..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక సినిమా థియేటర్లో హిట్ కాకపోతే ఓటిటీలో తమ సత్తా చాటుతున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఓటిటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా నటించిన ఆచార్య ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన విషయం విదితమే. ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు…
అచ్చతెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సందర్భానుసారం మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తమ సినిమాల విడుదల సమయంలో టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం హీరోహీరోయిన్లకు అలవాటే. అంతేకాదు… బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి గెస్టులుగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆహాలో ఈ వారం రెండు కార్యక్రమాలలో ‘మేజర్’ మూవీ టీమ్ సందడి చేయబోతోంది. ముంబై దుర్ఘటనలో అశువులు…
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్, బిగ్ బాస్ నాన్-స్టాప్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. ఫైనల్ ఎపిసోడ్ కి రంగం సిద్దం అయింది. ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్థక్ ఓటీటీ వెర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమతం అవటం విశేషం. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ఎవరూ నిలవలేదు. తొలి మహిళా విజేతగా బిందు మాధవి…
తెలుగు సినిమా ఇప్పుడు తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనే స్థాయిని దక్షిణాది సినిమా పూర్తిగా ఆక్రమించేసింది. దానికి అనుగుణంగా దక్షిణాది సినిమాలకు, తారలకు, దర్శకులకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ పెరుగుడు అసలు నిర్మాత మనుగడకే ప్రమాదం తీసుకురానుందా!? అంటే యస్ అనే వినిపిస్తుంది. సినిమాకు సంబంధించి రాబడి అంటే ఒకప్పుడు కేవలం థియేట్రికల్ కలెక్షనే. రాను రాను ఆదాయ మార్గాలు పెరిగాయి. ఆడియో, వీడియో, డబ్బింగ్, డిజిటల్,…
‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ నిజంగానే ఆ పేరు సార్థకం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సినిమాల సక్సెస్, వాటి కలెక్షన్స్ ను కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడంది. పైగా విషపూరిత ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారి చాలా రోజులయింది. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాను నటించిన మూడు రీమేక్ మూవీస్ ను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకోవడం…
తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశారు. అమన్ గిల్ తో కలిసి ‘దిల్’ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ ఉత్తరాది ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. నిజానికి ‘కేజీఎఫ్ -2’తో పాటే ఏప్రిల్ 14న ‘జెర్సీ’ని విడుదల చేయాలని ముందు అనుకున్నా, ఎందుకైనా మంచిదని ఓ వారం ఆలస్యంగా 22న రిలీజ్ చేశారు. అయినా ప్రతికూల ఫలితమే ‘జెర్సీ’కి లభించింది. ‘కబీర్ సింగ్’…
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ ఇటీవల కాలంలో వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇటీవల ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నయన్ తాజాగా ‘O2’ అనే సినిమాతో రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకుడు. డిస్నీ+ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ సినిమా…