Unstoppable with NBK: సీజన్ 2కు ముహూర్తం ఖరారైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’! నందమూరి నట సింహం బాలకృష్ణ అంత ఓపెన్ గా తన ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీస్ ను ప్రశ్నలు అడుగుతారని కానీ వారు అంతే స్పోర్టివ్ గా తీసుకుని వాటికి జవాబులు చెబుతారని కానీ ఆ ప్రోగ్రామ్ చూసే వరకూ ఎవరూ ఊహించలేదు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు, వాటికి ఫిల్మ్ సెలబ్రిటీస్ చెప్పిన సమాధానాల వీడియోస్ చూసి నివ్వెర పోయారు. దాంతో ఈ షోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
ఇంత సూపర్ హిట్ అయిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తిని చాలామంది కనబరుస్తున్నారు. అలానే బాలకృష్ణతో కాకుండా వేరెవరితో అయినా ‘అన్ స్టాపబుల్ షో’ చేస్తారేమో అనే సందేహాన్నీ కొందరు వ్యక్తం చేశారు. ఈ శుక్రవారం ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్ ‘అన్ స్టాబుల్ టాప్ 6’ ప్రోగ్రామ్ లో దీనికి సంబంధించిన సమాధానం దొరికింది. కార్యక్రమం చివరిలో బాలకృష్ణను వ్యాఖ్యాత, ప్రముఖ గాయకుడు శ్రీరామచంద్ర ‘ధైర్యం చేసి ఓ ప్రశ్న అడుగుతున్నాను… అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడు?’ అని అడిగాడు. దానికి బాలకృష్ణ నవ్వుతూ ‘మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే’ అంటూ బదులిచ్చారు. సో… అన్ స్టాపబుల్ షో సీజన్ 2 బాలకృష్ణతోనే ఉండబోతోందనేది ఖాయం. అలానే దీనిని దసరా కానుకగా జనం ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. సో… బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రేమికులకు ‘దసరా పండగ డబుల్ బొనంజా’ను ఇవ్వబోతోంది. బహుశా ఆ షో మెగాస్టార్ చిరంజీవితోనే మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే… తెలుగు ఇండియన్ ఐడల్ సెమీస్ కు బాలకృష్ణ గెస్ట్ గా వస్తే, ఫైనల్స్ కు చిరంజీవి హాజరు కాబోతున్నారు.
- Tags
- Aha
- bala krishna
- NBK
- OTT
- Unstoppable
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!