ప్రస్తుతం దేశంలో ఓటీటీ, గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని…తాను కూడా ఓటీటీకి అభిమానిని అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ‘ఇండియాజాయ్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టెక్నికలర్ ఇండియా కంట్రీ హెడ్, సిఐఐ నేషనల్ ఏవిజిసి సబ్ కమిటీ ఛైర్మన్ బీరెన్ ఘోష్, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకులు & సీఈఓ శ్రీ సాయి శ్రీనివాస్, సినీ నటుడు…
కరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఇండియా అతి పెద్ద ఓటీటీ మార్కెట్ గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెంచాయి. కరోనాతో థియేట్రికల్ రంగం కుదేలయిపోయింది. ఇప్పటికీ పలు ఏరియాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే భారతీయులు తమ దృష్టిని ఓటీటీవైపు మళ్ళించారు. పలు అంతర్జాతీయ డిజిటల్…
ఒక స్టార్ హీరో సినిమా ఓటీటీలో వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్ రిలీజ్ కావాలని హంగామా చేయటం మనం చూస్తూ ఉన్నాం. అదీ కాక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో ఆ యా భాషల్లో ఓ మోస్తరు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఐదు సినిమాలు ఏకంగా ఓటీటీలోనే రాబోతుండటం టాక్ ఆఫ్ ద నేషన్ అవుతోంది. అంతే కాదు…
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ కు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో టైఅప్ అయింది. ఈ ఒప్పందంలో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న నాలుగు చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో మొదటిది నవంబర్ 19న విడుదల కాబోతున్న ‘బంటీ అవుర్ బబ్లీ -2’. అలానే అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’తో పాటు ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘షంషేరా’ సినిమాలను…
అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు బ్యాడ్‌న్యూస్ అందించింది. కొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను అందించే అమెజాన్ ప్రైమ్ ఇకపై ప్రియం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక సబ్స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. దీంతో ఇప్పటివరకు వార్షిక ఫీజు రూ.999 చెల్లిస్తే సరిపోయేది. అయితే ఇకపై రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నెలవారీ, మూడు నెలల ప్లాన్లను కూడా అమెజాన్ ప్రైమ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలవారీ ప్లాన్ రూ.129 ఉండగా ఇకపై రూ.179 చెల్లించాలి.…
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీసెంట్ గా తెలుగులో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్ లో ‘టబు’ చేసిన పాత్రను మలయాళంలో మమతా మోహన్ దాస్ చేసింది. ఇక మమతా…
మురారి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ.. చాలా కాలం నుంచి అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘రంగమార్తాండ’ పైన చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఆయనకు జంటగా…
లాక్ డౌన్ తర్వాత వినోదరంగ ప్రాధాన్యమే మారిపోయింది. థియేటర్లు మూత పడటంతో గత కొంత కాలంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లే ప్రధానమైన వినోద వనరులుగా మారాయి. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లకు ఆదరణ పెరిగి చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల ఓ సర్వే ప్రకారం ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్ అత్యధిక సభ్యుల సభ్యత్వం పొందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది. సినిమాలు, వెబ్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్ వంటి యాక్టివిటీతో ఈ ప్లాట్ ఫామ్ పట్ల యూజర్స్…
కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తున్న తరుణంలో ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ థియేటర్లకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆగస్టు 6న విడుదల అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లోనూ మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆశర్యపోయిందట. దీంతో భారీ రేటుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై…
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మి రాకెట్’. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ క్రీడాకారిణి రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోరమైన సాధన చేసింది. ఈ చిత్రానికి ఆకాష్ ఖురానా దర్శకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్ విడుదల అవుతుందా.. అనే చర్చలకు కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘రష్మి రాకెట్’ సినిమా జీ5 లో దసరా…