Tollywood : ఈ వారాంతంలో ఎనిమిది చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నా, కొన్ని సినిమాలను మాత్రం నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ వారంతంలో రెండు చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. అందులో ఒకటి కళ్యాణ్ దేవ్ నటించిన తెలుగు సినిమా ‘కిన్నెరసాని’ కాగా, మరొకటి మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘సీబీఐ 5’. ఇందులో ‘కిన్నెరసాని’ జూన్ 10న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంటే, ‘సీబీఐ 5: ద బ్రెయిన్’ నెట్ ఫ్లిక్స్ లో 12వ తేదీ రాబోతోంది.
Also Read

ఇక ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు కూడా ఆరు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాని నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీ గురించి. కరోనా కాలంలో నాని నటించిన ‘వి’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే గత యేడాది డిసెంబర్ 25న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించినా, కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘అంటే సుందరానికీ…’మూవీపై నాని, అతని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మలయాళ నాయిక నజ్రియా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

సంపత్ కుమార్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘సురాపానం’ మూవీ 10వ తేదీ జనం ముందుకు వస్తోంది. మట్ట మధు యాదవ్ నిర్మించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ కామెడీ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటించింది. మరో స్ట్రయిట్ సినిమా ‘జరిగిన కథ’తో పాటు ఫిరోజ్ ఖాన్, సనా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘యు ఆర్ మై హీరో’ మూవీని 10వ తేదీన రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇక రక్షిత్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘777 చార్లీ’, ఆంగ్ల అనువాద చిత్రం ‘జురాసిక్ వరల్డ్ డొమీనియన్’ కూడా శుక్రవారమే థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటే ఏకంగా ఎనిమిది సినిమాలు ఈ వీకెండ్ లో జనం ముందుకు వస్తున్నట్టు లెక్క

తాజావార్తలు
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!