శ్రీకాకుళం ఎంపీ సీట్లో ఈసారి రామ్మోహన్ నాయుడికి మామూలుగా ఉండదా? గత రెండు విడతల్లో ఎదురవని, అసలు ఊహించని సమస్యలు ఎదురవబోతున్నాయా? సొంత పార్టీ నేతలే ఆయన్ని ఓడిస్తామని శపధం చేయడానికి కారణాలేంటి? మారుతున్న సిక్కోలు రాజకీయం ఏంటి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది శ్రీకాకుళం జిల్లా. కానీ… గత ఎన్నికలలో వైసీపీ హవా నడిచింది. అందుకే ఈసారి పట్టు నిలుపుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది పార్టీ నాయకత్వం. ఆ విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ముందున్నారన్నది…
ఏపీలో ఇప్పుడు పక్క చూపుల పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. అలాగని పార్టీ మారే నేతల గురించిన సబ్జెక్ట్ కాదు ఇది. కేవలం టీడీపీ, వైసీపీ అధిష్టానాలకు సంబంధించిన వ్యవహారం. ఎవరి ఇంటిని వాళ్లు చక్కబెట్టుకునే సంగతి ఎలా ఉన్నా… పక్కింట్లో ఏం జరుగుతుందోనని ఆరాలు తీయడం పెరిగిపోయిందట. ఇంతకీ ఏ విషయంలో రెండు పార్టీల అధిష్టానాలు ఎంక్వైరీలు చేస్తున్నాయి? దేని కోసం చూస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మే 13 ఫిక్సయింది. ఇప్పటికే సీట్ల కేటాయింపు…
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కారు దిగేస్తారా? ఆమె పార్టీ మారిపోవడం ఖాయమైనట్టేనా? అదే నిజమైతే బీఆర్ఎస్ ముఖ్య నేత కే.కేశవరావు పరిస్థితి ఏంటి? తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌కు హ్యాండిస్తారా? లేక తండ్రీ కూతుళ్లు చెరో పార్టీలో ఉంటారా? మేయర్ పార్టీ మార్పు కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి? వలస నేతల కోసం తెలంగాణ కాంగ్రెస్ గేట్లు తెరిచాక బీఆర్ఎస్ కారుకు కుదుపులు పెరిగిపోతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు బడా నేతలు…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతున్నాయి. జిల్లాలోని చాలా మంది పోలీస్ అధికారులకు ఈ విషయమై ఊపిరి సలపని ఫోన్స్ వస్తున్నాయట. ఆ కేస్‌లో మీరున్నారా? ఆ ఇద్దరిలో ఒక పేరు మీదేనంట కదా? అంటూ తెలిసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండటంతో… అబ్బే… అది నేను కాదని చెప్పుకోలేక సతమతం అవుతున్నారట. ఇంకొందరైతే… ఇదెక్కడి శీల పరీక్షరా.. బాబూ… అంటూ తలకొట్టుకుంటున్నట్టు తెలిసింది. ప్రణీత్‌రావు ఎస్ఐబీ డీఎస్పీగా…
ఉంచేద్దామా? మూసేద్దామా? సూటిగా, సుత్తిలేకుండా చెప్పండి. ఆఫీస్‌లకు అద్దె కూడా కట్టకుండా మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? క్లారిటీ ప్లీజ్… ఇదీ బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల ఆవేదన. ఆ ఆవేదనతోనే కేసీఆర్ మీదికి లేఖాస్త్రాన్ని సంధించారా లీడర్స్. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్ బిల్డింగ్‌లకు అద్దె కట్టడం లేదు, మా ఫోన్లు ఎత్తడం లేదు. సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేం పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అసలు మా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఉంచుతున్నారా?…
ఉన్నవి చాలవన్నట్టు టీడీపీ నేతల మీద కొత్త కొత్త కేసులు పడబోతున్నాయా? ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులే టార్గెట్‌గా బుక్ అవుతాయని పార్టీ అనుమానిస్తోందా? టీడీపీ అధిష్టానానికి ఇప్పుడా డౌట్ ఎందుకు వచ్చింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోంది? అసలీ కొత్త కేసుల కథేంటి? ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రేపోమాపో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థులను ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు…
సీటూ మాదే… ఓటు వేటా మాదేనంటూ ఇన్నాళ్ళుగా తొడలు కొట్టుకుంటూ తిరిగిన ఆ సీనియర్స్‌కి ఇప్పుడు సీట్లు చిరిగిపోతున్నాయా? కష్ట కాలంలో, క్లిష్ట సమయాల్లో సైతం గెల్చిన నేతలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు కానివారయ్యారు? ఉమ్మడి వెస్ట్‌లో సూపర్ సీనియర్స్ అనుకున్నవారిని సైతం ఫస్ట్ లిస్ట్‌లో పార్టీ అధిష్టానం ఎందుకు పక్కన పెట్టింది? ఎవరా నేతకు? ఎందుకలా జరిగింది? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్స్‌కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. తమ రాజకీయ జీవితంలో…
లోక్‌సభ ఎన్నికల్లో దున్నేస్తాం…. దుమ్ము దులిపేస్తాం…. తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టేస్తామని సవాళ్ళు చేస్తున్న కాషాయ దళానికి ఆ జిల్లాలో నడిపే నాయకుడు లేడట. ప్రతి సీటు ముఖ్యమని భావిస్తున్న టైంలో రెండు నియోజకవర్గాలున్న జిల్లాను పార్టీ నాయకత్వం ఎందుకు లైట్ తీసుకుంది? మాకో నాయకుడు కావాలి మొర్రో….. అని కేడర్ మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏదా జిల్లా? ఏవా రెండు నియోజకవర్గాలు? లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి టార్గెట్ 400 అంటోంది…
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఎందుకు హాట్ సీటైంది? అన్ని ప్రధాన పార్టీలు అక్కడే ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి? అదే నియోజకవర్గం కేంద్రంగా సీఎం రేవంత్‌ని టార్గెట్ చేసుకుని కేటీఆర్ మాటల తూటాలు పేల్చడానికి కారణాలేంటి? అన్ని పార్టీల్లో మల్కాజ్గిరి మల్లగుల్లాలకు కారణాలేంటి? లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం ప్రత్యేకమే అయినా… తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం హాట్ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో…