సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా ఉమ్మడిపోరు చేస్తామని ప్రకటించాయి టీడీపీ – జనసేన. ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తామని ఘనంగా వెల్లడించాయి. ఆ సందర్భంగా పవన్ స్పీడ్ చూసిన వాళ్లకు ఆ రోజో.. ఆ తర్వాత రోజో కార్యాచరణ ప్రకటిస్తారని… రెండు పార్టీల కార్యకర్తలు కలిసి రోడ్ల మీదకు వస్తారని అంతా అనుకున్నారు. అంతేనా… టీడీపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జనసేనతో పోత్తుకు ఇక బీజం పడినట్టేనని అంతా భావించారు. కానీ నెల…
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. పిలిచి మాట్లాడటమో.. వార్నింగ్ ఇవ్వడమో చేసేవారు పార్టీ పెద్దలు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిల విషయంలో ఏ జరిగిందో పార్టీ వర్గాలు చూశాయి. కానీ.. కేబినెట్లో చోటు కోల్పోయిన నాయకులు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు.. ఆధిపత్యపోరుతో నిత్యం వర్గపోరు రాజేస్తున్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఏదో ఒక రూపంలో సడెన్గా భగ్గుమంటున్నారు. అసంతృప్త…
మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట. పోరస్ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా…
ఇప్పటికే చాలా జండాలు మారాయి..చాలా కండువాలు కప్పారు.. తీసేశారు..కొంత కాలంగా ఇవన్నీ కాదని సైలెంట్ గా ఉన్నారు.. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ గాలి కింద సేదదీరుదామనుకుంటున్నారట..హస్తం, సైకిల్, కమలం.. ఇవన్నీ దాటుకుని వచ్చిన ఆయన వైసీపీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట.. మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా?అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారా? కీలక నేత దారెటు? సి కే జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయనాయకుల్లో ఒకరైన సికె బాబు, నాలుగు సార్లు…
ఆయన కెరీర్ మొదలైందే కారులో..అక్కడి నుండి కమలంపైకి చేరుకున్న రఘునందనరావు..మళ్లీ కారెక్కే సూచనలున్నాయనే టాక్ తెలంగాణ బిజెపిలో కలకలం రేపుతోంది.ఇప్పటికైతే ఆయన అంత సీన్ లేదనే క్లారిటీ ఇచ్చేశారు..కానీ, అనే డౌట్లు మాత్రం అలాగే మిగులున్నాయి.అదెలా అంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు.. బిజెపి నేత రఘనందన్ రావు పార్టీ వీడేది లేదని క్లారిటీ ఇచ్చేశారు.కానీ, అసలీ చర్చ ఎందుకు మొదలైంది? ఆయనలో ఉన్న అసంతృప్తి ఏంటి?నిప్పు లేకుండానే పొగరాదు. రాజకీయాల్లో ఆధారాల్లేకుండానే టాక్మొదలు కాదు..మరి రఘునందన్…
తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్లలో ఆయనొకరు..నాలుగుసార్లు అసెంబ్లీకి వెళ్లినా,ఆయనకు దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.ఎప్పటికప్పుడు ఆ పదవి, ఈ పదవి అని ఊహాగానాలు తప్ప ఒరుగుతున్నదేమీలేదు..ఆఖరికి ఇంత హైప్ మీద కారెక్కిన తర్వాత..ఇంకా వెయిటింగ్ లిస్టు తప్పదా అనే టాక్ నడుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రాజకీయాల్లో దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఎనభైల్లోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆలేరు…
శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డుపై కారు భీభత్సం ఇద్దరు యువకులకు గాయాలు హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డు చెన్నమ్మ హోటర్ వద్ద బ్రీజా కారు భీభత్సం సృష్టించి కాల్వట్టులోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కారులో ఉన్న ఇద్దరు…