ఆ మాజీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ఆయన మాటలు ఇప్పుడే ఎందుకు తేడాగా వినిపిస్తున్నాయి? మామీద మీ పెత్తనం ఏంటి? ఎక్కువ చేస్తే… పార్టీ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కబోమని ఎందుకు అంటున్నారు? చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఒకవైపు చెబుతూనే… మరోవైపు స్వరం మారుస్తున్న ఆ మాజీ ఎవరు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర వైసీపీలో ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయా అంటే… అవును, అలాగే కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందుకు తాజా ఉదాహరణగా……
కాళేశ్వరం కమిషన్ విచారణలో సరికొత్త ట్విస్ట్‌లు ఉండబోతున్నాయా? బీఆర్ఎస్ ముఖ్యులు ఇంకా ఇరుక్కుంటున్నారా? ఆ మంత్రి…. మాజీ మంత్రుల్ని గట్టిగా ఇరికించేస్తున్నారా? కమిషన్‌కు ముగ్గురు ముఖ్యులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవం లేదంటూ…. తన దగ్గరున్న ఆధారాలను కమిషన్ ముందు పెట్టారా? ఎవరా మంత్రి? ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణే హాట్ టాపిక్. బ్యారేజీ పియర్స్ కుంగుబాటుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారణ చివరి దశకు చేరుకుంది.…
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఆ సామాజికవర్గం అలకబూనిందా? ఎప్పుడూ పైచేయిగా ఉండే…. మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ నారాజ్ అవుతున్నారా? ఇటీవల జరిగిన పరిణామాలను ఆ కుల పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారా? అధికార పార్టీ మీద కోపంగా ఉన్న ఆ సామాజికవర్గం ఏది? ఎక్కడ తేడా కొట్టింది? తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంటేనే…. రెడ్ల పార్టీ అని ఓ ముద్ర ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే విస్తృతాభిప్రాయం. లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా… ఆ…
ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ అక్కచెల్లెళ్ళ మధ్య ఏదో జరుగుతోందా? ఇబ్బంది వచ్చినప్పుడు కూడా కనీసం ఒకర్ని ఒకరు పరామర్శించుకోలేనంత అగాధం పెరిగిపోయిందా? సినిమా, రాజకీయం కలగలిసిపోయినట్టుగా ఉండే ఆ సిస్టర్స్ ఎవరు? వాళ్ళ మధ్య సఖ్యత లేదన్న అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుముడతాయో… లేక ఆమే వివాదాలను వెతుక్కుంటూ వెళ్తారో తెలీదుగానీ… ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద టాపిక్‌తో చర్చల్లో వుంటున్నారు ఆమె.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్ళని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని, లేందటే.. వాళ్ళు అంత తేలిగ్గా.. మంత్రి పదవి పేరుతో ముందుకు నడిచేవాళ్ళు కాదని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించాలని కోరుకోవడంలో తప్పు లేదు.
వి.హన్మంతరావు అలియాస్ వీహెచ్. కాంగ్రెస్‌లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయనంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడాయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్‌కు లాయల్‌గా ఉంటూ... అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది.
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం సస్పెండ్ అయ్యారు. ఆయన మీద వేటు వేస్తూ... వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. డిపార్ట్మెంట్లో అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, ఈ సస్పెన్షన్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పోలీస్ స్టేషన్ ఇలాంటివి కామన్ అయిపోయాయి కాబట్టి.
గుంటూరు వెస్ట్.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ... ఇక్కడ ఇన్ఛార్జ్ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని.... పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఇన్నాళ్లు పార్టీ పరిస్థితులకు భిన్నంగా... కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంత కూటమిలో ఉన్నా... అధికారం చెలాయిస్తున్నా... సొంత బలం ఉంటేనే గౌరవం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ కాషాయదళం... ఆ దిశగా అడుగులేస్తోందట.
వైసీపీ అధినేత జగన్ దారి మారిందా? ఆయన కూడా డైవర్షన్స్ మొదలు పెట్టేశారా? ముక్కుసూటి రాజకీయం వర్కౌట్ కాదని తెలుసుకున్నారా? ఎప్పుడూ హైవే పాలిటిక్సే కాదు… ఇక నుంచి డొంక రోడ్డు రాజకీయం కూడా చేద్దామనుకుంటున్నారా? ఇంతకీ ఏం చేయబోతున్నారాయన? ఏంటా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్? వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పుడూ స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ చేస్తారన్న పేరుంది. అది లాభమైనా, నష్టమైనా…. నా దారి రహదారి అన్నట్టుగానే ఆయన వ్యవహారం ఉంటుందని చెప్పుకుంటారు. కానీ… అదంతా…