మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరు ఉన్నట్టుండి మారిపోయింది. ఎంతటి సీరియస్ విషయాన్నయినా కూల్‌గా డీల్ చేసి తనదైన శైలిలో సాఫ్ట్ ముగింపు ఇచ్చే ఈటల భాష ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. తన సహజత్వానికి భిన్నంగా ఆయన చేస్తున్న ఎగ్రెసివ్ కామెంట్స్ నాలుగైదు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతోంది.
సంగారెడ్డి జిల్లా బీజేపీ ఇటీవల కొత్త మండల అధ్యక్షుల్ని ప్రకటించింది. ఇక అంతే... ఆ ఒక్క ప్రకటనతో.... జిల్లా పార్టీలో వర్గపోరు భగ్గుమంది. తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటూ.. పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షురాలిపై సీరియస్ అయినట్టు సమాచారం.
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్‌గా రాజుకోబోతోందా అంటే... అవును... అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు.
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్... ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం... జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిరుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మొదలైన వివాదం తీవ్ర తుఫాన్‌గా మారుతోందేతప్ప తీరం దాటడం లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత రాజకీయ వైరం ఉంది.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక సమరమే అంటూ.... ఉద్యోగ సంఘాల జేఏసీ పేరుతో వచ్చిన ప్రకటనపై సీఎం తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం.
మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం... తెలంగాణలోనే అత్యంత ఖరీదైన సెగ్మెంట్. ఐటీ సెక్టార్ విస్తరించిన ఏరియా. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. అలాంటి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది.
ఆయన వైసీపీ మాజీ మంత్రి…అధికారంలో ఉన్నపుడు టీడీపీ, జనసేనలో ప్రధాన నేతలపై హద్దులు దాటి విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ మాజీ మంత్రి అంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడలి పోతున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు బెంబేలెత్తి పోతున్నారు. లెట్స్ వాచ్. జోగి రమేష్…ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నేత. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మొదలు పవన్…
ఆయన కండువా మార్చేశారు.. కండువా మార్చిన ఉద్దేశం నెరవేరకపోవడంతో పార్టీ, ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారు. కుంపటి పెడితే దారిలోకి వస్తారని ఆనుకున్నారో ఏమో కానీ.. పెద్దాయన రివర్స్ గేర్ వేశారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ?. అది ప్రైమ్ లొకేషన్. గుంట, అర గుంట భూమి కాదు.. 12 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు ఓ నేత. ఆక్రమణ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ.. ఇప్పటి వరకు దానివైపు అధికారులు ఎవరు కూడా కన్నెత్తి…
గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కానీ... తమకు పూర్తి మెజార్టీ ఉన్న చోట ఆ పరిస్థతి ఎందుకు వచ్చిందన్న అంతర్మధనం జరుగుతోందట వైసీపీలో. తమకు వెన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరంటూ లోకల్ లీడర్స్ ఆరా తీస్తున్నారట. జీఎంసీలో మొత్తం 57డివిజన్లు ఉంటే.... అందులో వైసీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి.