ఆ ఎమ్మెల్యే కన్ను పడితే…. ఎటువంటి భూమి అయినా ఖల్లాసేనా? ఇప్పటికే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని చెరబట్టేశారా? తమ్ముడితో కలిసి నియోజకవర్గంలోని కొండల్ని పిండి చేసేస్తున్నారా? ఈడీ దాడుల్లో అయ్యగారి బాగోతం మొత్తం అద్దంలో కనిపించిందా? అంత అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా బాగోతం? పటాన్చెరు నియోజకవర్గం టెక్నికల్‌గా సంగారెడ్డి జిల్లాలో ఉన్నా…. హైదరాబాద్ మహానగరంలో భాగంగానే భావిస్తుంటారు అంతా. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకునే…
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? కొత్త సీట్లలో పోటీ చేసేందుకు గులాబీ నాయకులు అల్రెడీ సిద్ధమైపోతున్నారా? వాళ్లకు అంత గట్టి భరోసా ఇచ్చింది ఎవరు? అధికారికంగా ఎక్కడా ఆ వాసనే లేని టైంలో… కారు పార్టీ నాయకులు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. అయితే… ఈసారి ఎలక్షన్స్ ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన చట్టంలో…
బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా? గట్టి వాదనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని చేజేతులా వదులుకుందా? ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని బేస్ చేసుకుని రేపు కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉందా? ఏ స్టాండ్ గులాబీ పార్టీకే బెడిసి కొడుతుందన్న చర్చలు మొదలయ్యాయి? ఏంటా వ్యవహారం? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. తొలి రోజు సభకు జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్….ఇక ఆ తర్వాత…
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కోవర్ట్‌లు ఉన్నారా? అదీకూడా… పై స్థాయిలోనే ఉన్నారా? ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే సమాచారాన్ని ప్రతిపక్షానికి చేరవేస్తున్నారా? ఆ దొంగలెవరో ఇప్పుడు రేవంత్ సర్కార్ పసిగట్టేసిందా? హిల్ట్ పాలసీ లీక్‌తో తీగ లాగితే డొంకలే కదులుతున్నాయా? ఇంతకీ ఎవరా కోవర్ట్‌లు? వాళ్ళ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పాలసీ హిల్ట్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో… పారిశ్రామిక వాడల్లో మల్టీపర్పస్ జోన్స్ అభివృద్ధికి…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ కన్ఫామ్ అయిపోయిందా? ఇన్నాళ్ళు ఉన్న అనుమానాలకు తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చేశారా? వ్యక్తిగా బయటికి వెళ్తున్నాను. తిరిగి రాజకీయ శక్తిగా సభలో అడుగుపెడతానని చెప్పడం వెనక ఉద్దేశ్యం పార్టీ ఏర్పాటేనా? మరి ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయా? పార్టీ ఏర్పాటులో ఆమె ఏ ఫార్ములాను అనుసరించబోతున్నారు? ఎమ్మెల్సీ పదవికి గతంలోనే రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత తాజాగా సభలో అందుకు కారణాలను వివరించారు. తనకు బీఆర్ఎస్లో తీవ్రమైన అవమానాలు…
ఏపీ సీఎం చంద్రబాబు అతి ముఖ్యమైన ఓ విషయాన్ని మర్చిపోయారా? లేక ఆయన్ని కొందరు మభ్య పెడుతున్నారా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాగా హడావిడి చేసిన ఓ మేటర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా ఎందుకు గుర్తుకు రావడం లేదు? ఏమో…. సెటిల్ అయిందేమో…. అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు ఏ విషయంలో బాబు వైఖరి అంతలా చర్చనీయాంశం అవుతోంది? ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా ఏదేదో…
ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదానికి ఇక లైన్ క్లియర్ అయినట్టేనా? ఇన్నాళ్ళు పెండింగ్‌లో ఉన్నా… ఇప్పుడు సభ సాక్షిగా కోరినందున ఇక ఛైర్మన్‌కు కూడా తప్పదా? నిజంగానే ఆమోద ముద్ర పడితే… అది ఎవరికి లాభం? ఎవరికి లైన్ క్లియర్ అవుతుంది. ఆ నేత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద పోటీ చేయగలరా? లెట్స్ వాచ్. శాసనమండలి సభ్యత్వానికి గతంలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత… అందుకు కారణాలను ఇవాళ సభలోనే వివరించారు. తెలంగాణ జాగృతి…
ఆ సీనియర్ మినిస్టర్ ముందు చూపు మామూలుగా లేదా? అసలు ఆలోచనేంటో అర్ధమైన కొందరు వావ్…. వాటే స్కెచ్. ఈయన మామూలోడు కాదంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారా? సార్…. చాలా దూరం ఆలోచించే కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారా? ఎవరా ఏపీ మంత్రివర్యులు? సొంత పార్టీ వాళ్ళ ముందరి కాళ్ళ బంధాలు ఎందుకు వేస్తున్నారు? 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి కేబినెట్ బెర్త్ పట్టేశారు ఆనం రామనారాయణ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైసీపీ…
అందరికీ ఫ్లవర్ బొకేలతో న్యూ ఇయర్ ఎదురొస్తే…. ఆ నేతకు మాత్రం పక్కలో బల్లేలు వెల్కమ్ చెప్పాయా? కొత్త ఏడాదిలో మన ఖర్మ ఇలా తగలడిందేంట్రా బాబూ… ఎంట్రీలోనే అంత షాకిచ్చింది అంటూ… సదరు సీనియర్ సన్నిహితుల దగ్గర వాపోతున్నారా? మరో నేత మౌనం బద్దలు కొడుతూ చేసిన సౌండ్ ఆయన చెవుల్లో రీ సౌండ్ ఇస్తోందా? ఎవరా నాయకుడు? ఏంటా న్యూఇయర్ సౌండింగ్ స్టోరీ? 2026 ఎంట్రీలోనే… మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్…
కూటమి ప్రభుత్వం కొత్త కేలిక్యులేషన్స్లో ఉందా? జిల్లాల పునర్విభజనతో పాత లెక్కల్ని సరిచేయాలనుకుంటోందా? వైసీపీ కంచుకోటల్లో టీడీపీ పాగా వేసే ప్రయత్నం కూడా జరుగుతోందా? ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫార్ములాను ఎక్కడ అమలు చేస్తోంది? ఆ కొత్త జిల్లా ఏర్పాటు క్రెడిట్ తెలుగుదేశం ఖాతాలో పడే అవకాశం ఉందా? లెట్స్ వాచ్. ప్రకాశంలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ ప్రాంత ప్రజల…