పాత సీసాలో కొత్త నీళ్ళు పోసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? నీళ్ళలో నిప్పులు రాజేసి పొలిటికల్‌గా గెయినయ్యే ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? ప్రభుత్వానికి దీటుగా తమ ప్లాన్ ఉండేలా పార్టీ పెద్దలు జాగ్రత్త తీసుకుంటున్నారా? ఇంతకీ గులాబీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? గవర్నమెంట్‌ని ఏ రూపంలో కౌంటర్ చేయాలనుకుంటోంది? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సెగలు పుట్టిస్తున్నాయి. నీళ్ళలో నిప్పులు రాజేయబోతున్నాయి. ఈ సెషన్ మొదలైన మొదటి రోజు జీరో అవర్లోనే హాట్ హాట్ చర్చ…
ఇన్నాళ్లు సైలెంట్ మోడ్‌లో ఉన్న ఆ వైసీపీ లీడర్ ఉన్నట్టుండి ఎందుకు యాక్టివ్ అయ్యారు. ఆరోగ్య సమస్యలున్నాసరే… పడుతూ లేస్తూనే… పర్యటనలు చేయడానికి కారణాలేంటి? పార్టీ అధ్యక్షుడి నుంచి ఆయనకేదైనా భరోసా దక్కిందా? ఎవరా లీడర్? ఆయన చెబుతున్న ఈక్వేషన్స్ అండ్ పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి కొన్నేళ్ళు కనుమరుగైన మాజీ ఎమ్మెల్యే తాజా కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయ ఉనికి చాటుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పట్నుంచే…
జనం సొమ్ముతో జల్సాలు చేయడమంటే జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్‌కు మహా సరదానా? ముక్కు పిండి వసూలు చేసే పన్నుల డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడానికి పోటీలు పడుతున్నారా? ఇంకో 40 రోజుల్లో పదవి నుంచి దిగిపోయే కార్పొరేటర్స్ ఏం వెలగబెడదామని, ఎవర్ని ఉద్ధరిద్దామని స్టడీ టూర్స్ వేయబోతున్నారు? అవి స్టడీ టూర్సా? లేక ఫైనల్ స్టేజ్‌లో వేసే జాలీ ట్రిప్సా? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో స్టడీ టూర్‌కు రంగం సిద్ధమవుతోంది. జనవరి నాలుగు నుంచి…
ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇక సింగిల్ టైం శాసనసభ్యుడిగానే మిగిలిపోతారా? నేను మోనార్క్‌ని, నచ్చినట్టు చేసుకుని పోతాను తప్ప ఎవ్వరితో నాకు పనిలేదని సదరు ఆఫీసర్ టర్న్డ్ ఎమ్మెల్యే అంటున్నారా? నియోజకవర్గంలో గ్రూప్స్‌ని సెట్ చేయాల్సిన నాయకుడే ఇంకా ఎగదోస్తున్నారా? దానివల్ల ఆయనకేంటి ఉపయోగం? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా మోనార్క్ స్టోరీ? గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీదే హవా. ఆ పార్టీ తరపున మాకినేని పెదరత్తయ్య వరుసగా ఐదు సార్లు…
పోలీసులు, పొలిటికల్ లీడర్స్ కంటే అక్కడ పేకాట క్లబ్స్ నిర్వాహకులే బాగా పవర్ ఫుల్లా?. పోలీస్ లాఠీకే చుక్కలు చూపించేంతలా కోత ముక్క తిరుగుతోందా?. తమ యాపారానికి అడ్డుపడే వాళ్ళు ఎంతటి వాళ్లయినాసరే.. వాళ్ళు వదిలిపెట్టబోరా?. ఆ విషయంలో ప్రభుత్వానిది కూడా ప్రేక్షక పాత్రేనా?.. ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఏంటా పేకాట పంచాయితీ?. భీమవరం అంటేనే… బ్రాండ్ ఆఫ్ బెట్టింగ్స్, కేరాఫ్ కోడి పందేలు అన్నది విస్తృతాభిప్రాయం. ఇక ఇక్కడ పేకాట గురించి అయితే… ఇక చెప్పేపనేలేదు.…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారే అవకాశం ఉందా? ఇక్కడి నాయకుల్ని డీల్ చేయడం నా వల్ల కాదు బాబోయ్ అంటూ… మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ పెద్దలకు చెప్పేశారా? అధిష్టానం కూడా కొత్త ఇన్ఛార్జ్ని దింపే ప్లాన్‌లో ఉందా? అధికారం ఉన్న రాష్ట్రంలో అసలు ఎందుకా పరిస్థితి వచ్చింది? గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని పేరున్న మీనాక్షి ఎందుకు హ్యాండ్సప్ అన్నారు? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఎంటరైనప్పుడు ఆమె మీద చాలా పెద్ద…
పార్టీని బలోపేతం చేయాల్సిన కొత్త అధ్యక్షుడే మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారా? అంతా నా ఇష్టం… రేపు మీరంతా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళేనని వార్నింగ్స్ ఇస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుకుని పోవాల్సిన నేత తన బాధ్యతల స్వీకారానికి కూడా కొందర్ని పిలవకపోవడాన్ని ఎలా చూడాలి? ఎవరా నాయకుడు? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు కలిసి ఉన్న గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి నుంచి పార్టీలోనే…
ఆమె తన మేనమామే కదా అని వదిలేసినట్టుంది. ఆయనేమో తన మేనకోడలు ఎమ్మెల్యే అంటూ తెగ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గానికి తానే కింగ్ మేకర్ అంటూ పోజులు కొడుతున్నారు. మరి…అక్కడ కోడలు ఎమ్మెల్యే అయితే మామ పెత్తనమే కొనసాగుతోందా? వందా యాభై చందాల నుంచి మొదలుపెట్టి రాజకీయ దందాలు చేస్తున్నదెవరు?ఇంతకీ…ఎవరా మామా కోడళ్లు?ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరే ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల వేళ అనూహ్యంగా…
మంత్రుల గొంతు మూగబోయిందా?పార్టీ, ప్రభుత్వంపై ఆ రేంజ్లో విపక్షం విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా?అప్పోజిషన్ గ్యాప్ కూడా ఇవ్వకుండా సర్కార్‌పై ఎటాక్ చేస్తుంటే వీళ్లంతా మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారు?చెప్పుకోవడానికి ఊరంతా బలగమే ఉన్నా…అసలు ఉపయోగమే లేకుండాపోయిందా?రాజకీయ పదవులు అనుభవిస్తూ…పెదవులు మూసుకున్న ఆ నేతలెవరు? మాకెందుకు..తిట్టింది మమ్మల్ని కాదుగా అనుకుంటున్నట్టున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలా అని తనదాకా వస్తే మాత్రం…చూశారా?ఎవరు మద్దతుగా లేరు అని అనుకోవడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందట. కాంగ్రెస్ పార్టీ…
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా?పార్టీ అధికారంలోకి వచ్చినా…ఇప్పటి వరకు హైకమాండ్ వాళ్ల వైపు ఎందుకు చూడలేదు?గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవటానికి కారణం ఏంటి?జనం కోసం కేసులు, కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా?పార్టీ అధికారంలోకి రావటానికి కీలకమైన ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి…సొంత వాళ్లను ఎందుకు వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు…