నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పంచాయతీ.. చినికి చినికి గాలి వానలా మారి ఒక రకంగా జిల్లా పార్టీనే షేక్ చేస్తోంది. ఓ ముఖ్య నేత సన్నిహితుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. మరో ముఖ్య నేత సన్నిహితుని కుమారుడిని ఏకంగా అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాకు హెడ్ క్వార్టర్ కొత్తగూడెం. ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను... ఒక్క కొత్తగూడెం మాత్రమే జనరల్ సీటు. మిగతా నాలుగు ఎస్టీ రిజర్వ్డ్. ఇక నియోజకవర్గంలో మొన్నటి వరకు రెండు మున్సిపాలిటీలు ఉండగా... అందులో పాల్వంచకు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టుబట్టి రెండు మున్సిపాలిటీలకు మరి కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖను చూస్తున్నారు ఆ మహిళామంత్రి. ఉత్తరాంధ్రకు చెందిన సదరు మినిస్టర్ చుట్టూ.. ఇప్పుడు వివాదాలు ఓ రేంజ్లో ముసురుకుంటున్నాయట. ఆ మంత్రి పేషీలో జరుగుతున్న వ్యవహారాలు చూసి ప్రభుత్వ పెద్దలకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాపు తమ్ముళ్లు కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నారట. పార్టీ అధికారంలో ఉన్నా.. తమకు ప్రయారిటీ ఉండడంలేదంటూ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు జిల్లాలో. అటు టీడీపీ అధిష్టానం వ్యవహారం కూడా అలాగే ఉందని, కనీసం తమ గోడు విన్న పాపాన పోలేందంటూ ఓపెన్‌గానే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు సీనియర్ లీడర్స్.
స్థానిక ఎన్నికల సమరానికి అస్త్ర శస్త్రాలతో... సరికొత్త ఊపు, ఉత్సాహంతో సిద్ధమవుతోందట తెలంగాణ బీజేపీ. పార్టీకి కొత్త సారధి వచ్చాక ఎదుర్కోబోయే తొలి ఎన్నిక కావడంతో.... ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నాయి బీజేపీ శ్రేణులు.
ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే.. నిత్యం ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో బిజీ బిజీగా ఉండేవారు. కానీ...మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యమాల తీరు కూడా మారిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
గంటా శ్రీనివాసరావు....తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని నాయకుడు. ఆయన పొలిటికల్ సక్సెస్‌ల సంగతి ఎలా ఉన్నా... ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారని మాత్రం గట్టిగా చెప్పుకుంటుంటాయి రాజకీయ వర్గాలు.
అక్కడ మామ పొలిటికల్ జర్నీకి అల్లుడు మోకాలడ్డుతున్నాడా? లేక అల్లుడికి చెక్ పెట్టేందుకు మామ కామ్‌గా పావులు కదుపుతున్నాడా? సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని రెండు పక్షాల అనుచరులు రక్తి కట్టిస్తున్నారా? గత ఎన్నికల్లో అల్లుడి చేతిలో ఓడిన ఆ మామ ఎవరు? ఇద్దరి మధ్య సోషల్ యుద్ధంలో బయటికి వస్తున్న కొత్త విషయాలేంటి? పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు…