ప్రముఖ విద్యావేత్త, కవి, ఇంజనీర్ డా. వి.మాలకొండారెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయనను ఉండేల మాలకొండారెడ్డి అంటేనే అంతా గుర్తుపడతారు. చిన్న తనం నుంచే ఆయన కవిత్వం చెప్పేవారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి పొందారు. మాలకొండారెడ్డి 1932 ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువు ముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బీఈ డిగ్రీ పూర్తిచేశారు. ఎడిన్‌బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి…
తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు.. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదు చేశారు.. ఇక, నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు.. నకిలీ సర్టిఫికెట్ విషయాన్ని సీపీకి వివరించారు విద్యార్థి నేతలు… కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్ అడ్డగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు..…
కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టుతుండడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించాయి. అయితే కరోనా నిబంధనలను మాత్రం కట్టుదిట్టంగా అమలు చేస్తూ.. విద్యాసంస్థలు నిర్వహించాలని ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కరోనా సెలవుల్లో జరగాల్సిన పరీక్షలు, పరీక్షా ఫీజు చెల్లింపులల్లో గందరగోళం నెలకొంది. దీంతో తాజా యూజీ 1, 3…
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లోని అన్ని కోర్సులకు ఆఫ్‌లైన్ తరగతులు ఫిబ్రవరి 1 మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని సోమవారం సాయంత్రం అధికారులు తెలిపారు. ‘ప్రభుత్వ సూచనల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లోని అన్ని కోర్సులకు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయని ఓయూ నుంచి పత్రికా ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు కోర్సులు ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతాయని పేర్కొన్నారు. “నగరంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్…
కరోనా, ఒమిక్రాన్ మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. వీటి దెబ్బకు అన్ని వ్యాపారసముదాయాలు, విద్యాసంస్థలు ఇతర పనులు వాయిదా, లేదంటే మొత్తంగా మూత పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే కరోనా,ఒమిక్రాన్ దెబ్బ అన్నింటి కన్నా ఎక్కువగా విద్యాసంస్థలపై పడింది. ఎప్పుడు ఏమౌవుతుందోనని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. అయితే తాజాగా ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సీటీ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను విశ్వ విద్యాలయం వాయిదా వేసింది. Read Also: బండి…
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్…
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్ త్వరలో బయోడైవర్సిటీ పార్క్, ఆక్సిజన్ పార్క్‌కు నిలయంగా మారనుంది. దీనికోసం వర్సిటీ అధికారులు తదనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐపీఈ భవనానికి సమీపంలోని క్యాంపస్‌లో అంతర్గత భాగాలలో 200 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ తెలిపారు. విశాలమైన యూనివర్సిటీ క్యాంపస్ అనేక రకాల వృక్షాలతో ఔషధ విలువలను కలిగి ఉన్న అనేక మొక్కలను కనుగొనవచ్చు. అయితే, కాలక్రమేణా చోటు చేసుకున్న…
ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో సమాధి కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం కాలేజీ హాస్టల్ వెనుక స్థలానికి వెళ్లిన కొందరు విద్యార్థులకు సమాధి కనిపించడంతో భయంతో హాస్టల్ కు పరుగులు తీశారు. అనంతరం.. ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పారు. అక్కడితో ఆగని ఆ విషయం… చీఫ్ వార్డెన్ దృష్టికి వెళ్లింది. సమాధిలో జంతువునా.. మనిషిని పూడ్చి పెట్టారా.. అనేది తెలియాల్సి ఉంది. సమాధిపై చల్లిన పూలు తాజాగా ఉండగా… ఇటీవలే తవ్వి పూడ్చినట్లుగా ఆ సమాధి…
ఉరుకుల పరుగుల హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి కొంచెం కష్టమే. అయితే ఉదయాన్నే పచ్చటి వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, యోగా లాంటివి చేయడానికి ఉస్మానియా యూనివర్సీటీ పరిసరాల ప్రజలు ఓయూ క్యాంపస్‌ను వినియోగించుకుంటుంటారు. అయితే ఇలా తార్నాక, డీడీ కాలనీ, విద్యా నగర్, మాణికేశ్వర్ నగర్, అడిక్‌మెట్, హబ్సిగూడ, అంబర్‌పేట్‌తో సహా ఓయూ పరిసర ప్రాంతాల నుండి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్‌లో వాకింగ్, రన్నింగ్, జాగింగ్‌తో పాటు యోగా వంటి…
నేడు క్రీడా దినోత్సవం సందర్బంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓయూలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరైయ్యారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మరో ఇరువై ఏళ్ళు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అలాగే…